విద్యార్థులు దాతల ద్వారా పొందే ఇటువంటి సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలి.
గ్రామస్తులు మెరుగైన విద్యను అందించే ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లలను చేర్పించాలి.
లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ-నోబుల్” ఆధ్వర్యంలో యరసానిగూడెం ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు 25 వేల రూపాయల స్పోర్ట్స్ డ్రెస్ , షూస్ అందజేత. కట్టంగూర్ మండల విద్యాధికారి అంబటి అంజయ్య .
నల్లగొండ ఉమ్మడి జిల్లా . ఫిబ్రవరి 18 .(లోకల్ గైడ్)
లయన్స్ క్లబ్ సేవలు ఎంతో గొప్పవి అని, ఈ సేవలను వినియోగించుకుని విద్యార్థులు అభ్యసనంలో రాణించాలని కట్టంగూర్ మండల విద్యాధికారి అంబటి అంజయ్య అన్నారు. బుధవారం మండలంలోని యరసానిగూడెం ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో “లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ-నోబుల్” వారి ఆధ్వర్యంలో విద్యార్థులకు 25 వేల రూపాయల విలువైన స్పోర్ట్స్ డ్రెస్ , షూస్ ను ఉచితంగా అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మండల విద్యాధికారి అంబటి అంజయ్య విద్యార్థులకు మెటీరియల్ ను పంపిణీ చేసి, మాట్లాడుతూ పేద విద్యార్థులు చదువుతున్న ప్రభుత్వ పాఠశాలలను లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ-నోబుల్ వారు దాతృత్వ సేవలకు ఎంపిక చేసుకోవడం సంతోషకరమని అన్నారు. విద్యార్థులు దాతల ద్వారా పొందే ఇటువంటి సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. క్లబ్ సభ్యులకు, దాతలకు ధన్యవాదాలు తెలిపారు. గ్రామస్థులు కూడా మెరుగైన విద్యను అందించే ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించాలని, ప్రభుత్వ పాఠశాలల్లో నమోదును పెంచాలని ఆయన కోరారు.పాఠశాల ప్రధానోపాధ్యాయులు చింత యాదగిరి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆకిటి శంకర్, లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ-నోబుల్ అధ్యక్షులు తంతెనపల్లి సైదులు, క్లబ్ సభ్యులు మరియు దాతలు ముప్పిడి మల్లయ్య, యాపాల బాషిరెడ్డి, మోహన్ రెడ్డి, కొమ్మనబోయిన మారయ్య, కర్ణాకర్ రెడ్డి, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ కొరివి యాదమ్మ, ఉపాధ్యాయులు గాలి సంధ్యారాణి, బి.శ్రీనివాస్, తరాల పరమేశ్ యాదవ్, జానపాటి శంకర్, వార్డు సభ్యుడు రామచంద్రు, పులకరం నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
