ఎల్లేశం అకాల మరణం బాధాకరం.
విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ అధ్యక్షుడు కిరణ్.
బాధిత కుటుంబానికి రూ.5వేల ఆర్థిక చేయుత.
లోకల్ గైడ్/తాండూర్:
పెద్దేముల్ మండల ఎమ్మార్పీఎస్ నాయకులు బాగాయిపల్లి ఎల్లేశం అకాల మరణం బాధాకరమని వికారాబాద్ జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, న్యాయవాది కందనెల్లి కిరణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంగళవారం మధ్యాహ్నం ఎల్లేశం మరణ వార్త తెలుసుకొని కుటుంబ సభ్యులకు అంత్యక్రియల నిమిత్తం రూ.5 వేల ఆర్థిక సహాయంతో పాటు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ...ఎమ్మార్పీఎస్ తొలి తరం నాయకులు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా లోని పెద్దేముల్ మండల పరిధిలోని కందనెల్లి నుంచి ప్రాతినిధ్యం వహించారు.ఆయన అకాల మరణం అందరి హృదయాలను కలచి వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.అంతే కాక ఎమ్మార్పీఎస్ లో డప్పు కళాకారుడిగా, నికార్సైన కార్యకర్తగా ఆయన పనిచేశారు అని ఆయన జ్ఞాపకాలను స్మరించుకున్నారు. కాగా ఎల్లేశం మరణం ఎమ్మార్పీఎస్ కు తీరని లోటు అని ఎంఎస్పి జిల్లా కమిటీ పక్షాన ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తూ ఆయన కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని ఆనంద్ మాదిగా భగవంతుని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో మహాజన సోషలిస్టు పార్టీ జిల్లా అధ్యక్షులు పి ఆనంద్ మాదిగ, సీనియర్ నాయకులు పెద్దోళ్ల ఆనంద్ కుమార్, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు మల్లికార్జున్ మాదిగ, మహాజన సోషలిస్టు పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి స్వామిదాస్ మాదిగ, జిల్లా ఉపాధ్యక్షులు తానం నర్సింలు, జీనుగుర్తి నర్సింలు, మహిళా నాయకురాలు పుష్ప రాణి, సీనియర్ నాయకులు అనంతయ్య నందు, ఎంఎస్ఎఫ్ నాయకులు శివాజీ తదితరులు పాల్గొన్నారు.
