ప్రతి పాఠశాలలో బడిబాట కార్యక్రమం

ఎంఈఓ ఆనంద్ రావు

ప్రతి పాఠశాలలో బడిబాట కార్యక్రమం

కామారెడ్డి జిల్లా రామారెడ్డి మే 14 (లోకల్ గైడ్) 

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక   విద్యా వారోత్సవాలు భాగంగా రామారెడ్డి మండలం నందు ప్రతి పాఠశాలలో బడిబాట కార్యక్రమం  పేరెంట్ టీచర్స్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఇట్టి సమావేశం నందు ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వము అందచేస్తున్నటువంటి సౌకర్యాలను ప్రతి విద్యార్థికి రెండు జతల యూనిఫామ్స్, టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్, స్కూల్ బ్యాగ్,  షూస్ అందజేయడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది , ప్రతిరోజు ఉదయం  టిఫిన్ తో పాటు పాలు రాగి జావా మధ్యాహ్నం లంచ్ ఇవ్వనున్నట్లుగా ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు తెలియజేసినారు కావున మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించవలసినదిగా తల్లిదండ్రులను కోరడమైనది 
ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి ఆనంద్ రావు మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వ పాఠశాలలో త్రాగునీటి సౌకర్యాము, టాయిలెట్స్, ఉన్నత పాఠశాలలో సైన్స్ మ్యాస్ ల్యాబ్లు డిజిటల్ బోధనతో కూడిన విద్యా బోధన ఉపాధ్యాయులచే అందించబడుతుందని విద్యార్థులను మంచి ప్రతిభావంతులుగా తీర్చి దిద్దుతామని తెలియజేయడం జరిగింది కావున మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించవలసిందిగా ఎంఈఓ ఆనంద్ రావు   తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేసినారు.

Tags:

About The Author

Latest News