అశ్వారావుపేట అభివృద్ధికి నా జీవితం అంకితం .....మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

​అట్టహాసంగా పామాయిల్ రైతుల ఆత్మీయ సమ్మేళనం

అశ్వారావుపేట అభివృద్ధికి నా జీవితం అంకితం .....మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

​ప్రభుత్వ హార్టికల్చర్ కళాశాలను ప్రారంభించిన మంత్రి, ఎమ్మెల్యే

 

 

 

​అశ్వారావుపేట, లోకల్ గైడ్ :

పామాయిల్ రైతుల సంక్షేమం, వ్యవసాయాభివృద్ధి లక్ష్యంగా నిర్వహించిన పామాయిల్ రైతుల ఆత్మీయ సమ్మేళనం, హార్టికల్చర్ కళాశాల ప్రారంభం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
​సమ్మేళనానికి విచ్చేసిన మంత్రి తుమ్మలకు రైతులు, గిరిజన కళాకారులు డప్పు వాయిద్యాలు, సంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానంపై ఏర్పాటు చేసిన డిజిటల్ ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. అనంతరం సభలో ప్రసంగించిన మంత్రి తుమ్మల కొంత భావోద్వేగానికి లోనయ్యారు. గత 50 ఏళ్లుగా నన్ను కంటికి రెప్పలా కాపాడుతున్న ప్రజలకు, రైతులకు నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. పదవులు వస్తుంటాయి, పోతుంటాయి, కానీ ప్రజల ప్రేమ మాత్రమే శాశ్వతమని, అశ్వారావుపేట అభివృద్ధికి నా తుదిశ్వాస వరకు కట్టుబడి ఉంటాను అని మంత్రి స్పష్టం చేశారు. నవ ధాన్యాల గడ్డ
​అశ్వారావుపేట నేల ఎంతో సారవంతమైనదని, భారతదేశంలో ఎక్కడ పండే పంటనైనా ఇక్కడ పండించవచ్చని మంత్రి కొనియాడారు. రైతుల ఆదాయం పెంచడమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని, ప్రపంచ మార్కెట్ డిమాండ్‌ను బట్టి రైతులు పంటలు వేయాలని సూచించారు. పామాయిల్ సాగు చేసే రైతులకు నాణ్యమైన మొక్కలు, సాంకేతిక పరిజ్ఞానం, మార్కెటింగ్ సదుపాయాలు కల్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ​ఒకప్పుడు సైకిల్ కూడా వెళ్లలేని ప్రాంతాల్లో నేడు అద్భుతమైన రహదారులు వచ్చాయని, సాగునీరు, విద్య, వైద్యం గ్రామ స్థాయికి చేరాయని మంత్రి గుర్తు చేశారు. గిరిజన నిరుద్యోగుల కోసం గతంలో తెచ్చిన జీఓ నెంబర్-3 ప్రాముఖ్యతను ప్రస్తావిస్తూ, గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
*​హార్టికల్చర్ కళాశాల ప్రారంభం*
​అంతకుముందు, మంత్రి తుమ్మల మరియు ఎమ్మెల్యే ఆదినారాయణ కలిసి అశ్వారావుపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ హార్టికల్చర్ కళాశాలను ప్రారంభించారు. ఈ కళాశాల ద్వారా యువతకు ఆధునిక వ్యవసాయ విద్య లభిస్తుందని, ఇక్కడి పరిశోధనలు నేరుగా రైతులకు లబ్ధి చేకూరుస్తాయని వారు పేర్కొన్నారు. ​అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మాట్లాడుతూ, ఈ ప్రాంతాన్ని వ్యవసాయ రంగంలో ఒక మోడల్‌గా తీర్చిదిద్దుతామన్నారు. రైతుల సమస్యల పరిష్కారానికి తాను నిరంతరం శ్రమిస్తానని, హార్టికల్చర్ కళాశాల ఏర్పాటు ఈ ప్రాంత భవిష్యత్తుకు మలుపురాయి అని అన్నారు. ​రాష్ట్రవ్యాప్తంగా 15 జిల్లాల నుండి తరలివచ్చిన ఆయిల్ పామ్ రైతులు.
​ఆయిల్ పామ్ సాగులో ఆధునిక పద్ధతులపై ఆయిల్ ఫెడ్ అధికారుల అవగాహన.
​జిల్లా కలెక్టర్, వ్యవసాయ అధికారులు, రైతు సంఘాల నేతల భాగస్వామ్యం. ​రైతుల హర్షధ్వానాల మధ్య, వ్యవసాయ విప్లవానికి అశ్వారావుపేట వేదికగా నిలుస్తుందన్న నమ్మకంతో ఈ సమ్మేళనం ముగిసింది.

Tags:

About The Author

Latest News