ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది-

రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి. 

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది-

 
రంగారెడ్డి జిల్లా బ్యూరో,  (లోకల్ గైడ్ ):     
             ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసుకుంటూ, ప్రభుత్వ పాఠశాలల్లో అధిక సంఖ్యలో విద్యార్థులు చేరే విధంగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అన్నారు.
  ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాIMG-20260514-WA0250ల్లో భాగంగా ఈ నెల 13వ తేదీ నుంచి ప్రారంభమయిన విద్యా వారోత్సవాలలో భాగంగా గురువారం జయశంకర్ బడిబాట, పేరెంట్ టీచర్ మీటింగ్ ను రంగారెడ్డి జిల్లా కందుకూర్ మండలం నేదునూర్ తెలంగాణ మోడల్ స్కూల్,  జూనియర్ కాలేజీలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. 
  ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈనెల 11 నుండి విద్యా వారోత్సవాలను ప్రారంభించడం జరిగిందని, అందులో భాగంగా నేడు జయశంకర్ బడిబాట, పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించడం జరుగుతున్నదని తెలిపారు. ప్రైవేట్ పాఠశాలల్లో నెలకు ఒకసారి పేరెంట్ టీచర్స్ మీటింగ్ నిర్వహిస్తారు, తమ పిల్లలు ఏవిధంగా చదువుతున్నారో ఈ మీటింగు ద్వారా తెలుసుకోవడం జరుగుతుందని, అలాంటి సమావేశాలను మన ప్రభుత్వ పాఠశాలలో కూడా నిర్వహించి తల్లిదండ్రులకు వారి పిల్లలు చదువులో ఏవిధంగా రాణిస్తున్నారో తెలియజేయవలసిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు వెరీ క్వాలిఫైడ్ టీచర్స్ బోధన చేయడం జరుగుచున్నదని, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రెండు జతల యూనిఫామ్ కూడా అందించడం జరుగుతున్నదని తెలిపారు . ఉపాధ్యాయులు తల్లిదండ్రులు కలిసి పని చేయడం ద్వారా ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో బోధనా అందించి విద్యార్థులను ఉన్నత స్థాయికి చేర్చేందుకు వీలవుతుందని, అందుకు గ్రామ స్థాయి పాలకవర్గం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు అధిక సంఖ్యలో చేరేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించి ప్రభుత్వ పాఠశాలలలో చేరేలా కృషి చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని రకాల వసతులను కల్పించడం జరుగుచున్నది, తల్లిదండ్రుల తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో కాకుండా ప్రభుత్వ పాఠశాలలో చేర్చాలని, ప్రభుత్వ పాఠశాలల్లో అందించే అన్నీ వసతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులే నేడు అని రంగాల్లో రాణించడం జరుగుతున్నదని, అంతే కాకుండా ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులకు సమస్యలను ఎదుర్కొనే శక్తి అలవాడుతుందన్నారు.  సమస్యలను పరిష్కరించే అవగాహన కలుగుతుందని తెలిపారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్ లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థినిలను ఈ సందర్బంగా కలెక్టర్ సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.  ఇక ముందు కూడా ఇదే స్పూర్తితో ఉన్నత చదువులలో రాణించాలని సూచించారు.  
  ఈ కార్యక్రమంలో నేదునూర్ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ విష్ణుప్రియా, ఎంపిడిఓ, తహశీల్దార్ గోపాల్, ఎమ్ఈఓ, విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Tags:

About The Author

Latest News