బీసీలకు నామినేటెడ్ పదవుల్లో 50 శాతం అవకాశం కల్పించాలి 

బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జాజుల లింగంగౌడ్

బీసీలకు నామినేటెడ్ పదవుల్లో 50 శాతం అవకాశం కల్పించాలి 

 మిర్యాలగూడ ఏప్రిల్ 8
 (లోకల్ గైడ్ తెలంగాణ )

జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలకు త్వరలో భర్తీ చేసే నామినేటెడ్ పదవుల్లో 50 శాతం అవకాశం కల్పించాలని ఈరోజు గాంధీభవన్ లో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ని కలిసి విజ్ఞప్తి చేసినట్లు బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జాజుల లింగం గౌడ్ పేర్కొన్నారు ఈ సందర్భంగా లింగం గౌడ్ మాట్లాడుతూ గత ఎమ్మెల్యే ఎంపీ ఎన్నికల సందర్భంగా బీసీలకు ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు అడిగితే గెలుపు గుర్రాలకి టికెట్లు ఇస్తామని చెప్పి బీసీలకు ఎక్కువ టికెట్లు ఇవ్వలేదని అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పదవుల్లో బీసీలకు అధిక ప్రాధాన్యత ఇస్తామని చెప్పి ఇప్పుడు అది కూడా చేయడం లేదని ఏదో తూ తూ మంత్రంగా ప్రాధాన్యత లేని పదవులను బీసీలకు కట్టబెడుతూ కేవలం ఒకే ఒక కులానికి అన్ని పదవులు కట్టబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీకి సంబంధం లేని అగ్రకులాల వ్యక్తులకు కార్పొరేషన్ పదవులు కట్టబెడుతూ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా పార్టీని నమ్ముకున్న బీసీలకు మాత్రం మొండి చేయి చూపిస్తున్నారని అన్నారు.టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్  సానుకూలంగా స్పందిస్తూ మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 50 శాతం పైగా మున్సిపల్ కౌన్సిలర్లను చైర్మన్ లను చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ దేనని తెలిపారు. త్వరలో భర్తీ చేసే నామినేటెడ్ పదవుల్లో కూడా బీసీలకు అధిక ప్రాధాన్యతను ఇస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి జేఏసీ చైర్మన్ బొల్లేపల్లి స్వామి గౌడ్,ఏకుల లక్ష్మి అమృతం,కుర్మటి రాకేష్
కిన్నెర ప్రభు,నక్క శ్రీశైలం యాదవ్, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

సీతారామ ప్రాజెక్టు బాట పట్టిన మంత్రి తుమ్మల సీతారామ ప్రాజెక్టు బాట పట్టిన మంత్రి తుమ్మల
లోకల్ గైడ్: ఖమ్మం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని ములకలపల్లి మండలంలోని కమలాపురం నుండి అన్నపరెడ్డిపల్లి మండలంలోని తొట్టి పంపు వరకు సుమారు 20 కిలోమీటర్ల మేర ఉన్న...
తెలంగాణ రాష్ట్రంలోని వివిధ పాఠశాలలకు చెందిన
గ్రోఫోలియో గ్రాండ్ లాంచ్
రంగారెడ్డి జిల్లాలో జర్నలిస్టుల సమన్వయానికి కీలక అడుగు
రంగారెడ్డి జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ ఏర్పాటు.
బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ కూటమికి మహిళలే బుద్ధి చెబుతారు
ఎండాకాలం జాగ్రత్తలు తెలియజేయాలి.