సమ్మె చేస్తున్న ఆర్టిసన్స్ ను చర్చలకు పిలవాలి.
సమస్యలను పరిష్కరించి సమ్మె ను నివారించాలి.
ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం.
నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి . ఏప్రిల్ 9 (లోకల్ గైడ్)
విద్యుత్ సంస్థలో విధులు నిర్వహిస్తున్న ఆర్టిజన్స్ ను తక్షణమే కన్వర్షన్ చేయాలని, సమ్మె చేస్తున్న కార్మికులను చర్చలకు పిలిచి సమస్యను పరిష్కరించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని విద్యుత్ కార్యాలయం వద్ద టీవీ ఏసి జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మె రెండో రోజుగురువారం ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం పాల్గొని సంగీభావం తెలిపి మాట్లాడుతూ రెండు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసన్స్ సమ్మె చేస్తున్న ప్రభుత్వం చర్చలకు పిలువకపోవడం విచారకరమనీ అన్నారు.విద్యుత్ సంస్థలో గత 22 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నారని అర్హతను బట్టి కన్వర్షన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. గత ప్రభుత్వం గుర్తించింది కానీ బ్రిటిష్ కాలం నాటి స్టాండింగ్ ఆర్డర్స్ రూల్స్ ను అమలు చేస్తూ రెగ్యులర్ ఉద్యోగులకు, ఆర్టిజన్స్ కు వ్యత్యాసం కల్పించేలా ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టిజన్ లను విద్యార్హతలను బట్టి జూనియర్ లైన్ మెన్ లు గా డిప్లోమా వారికి సబ్ ఇంజనీర్లుగా ఆఫీస్ సబార్డినేటర్ లుగా జూనియర్ అసిస్టెంట్ గా ప్రభుత్వం గుర్తించాలని కోరారు. చాలీచాలని వేతనాలతో జీవనాన్ని గడుపుతున్నారని కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పరంగా అన్ని సౌకర్యాలు కల్పించేలా కన్వర్షన్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు .
ప్రభుత్వం వెంటనే విద్యుత్ కార్మికులను చర్చలకు పిలిచి సమస్యలను పరిష్కరించి సమ్మె ను నివారించాలని కోరారు.ఈ రెండవ రోజు సమ్మెలో ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు శ్రావణ్ కుమార్, గీతా పనివారల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పబ్బు వీర స్వామీ జెఎసి జిల్లా చైర్మన్ జిట్టబోయిన లింగస్వామి, జిల్లా నాయకులు గుండ లింగారెడ్డి పెరిక శేఖర్ వేణుగోపాల్ రెడ్డి పెరమళ్ళ మురళి,అద్దంకి వెంకన్న లతీఫ్ విజయ్ ఉమాదేవి నాగమణి రమ్య సతీషు ప్రవీణ్, రమేషు నరసింహ ,పవన్ మల్లయ్య, వెంకన్న , ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం నందం జిల్లా నాయకులు బాసాని వెంకటయ్య ,సర్దార్, తదితరులు పాల్గొన్నారు
