మసిగుండ్లపల్లిలో భారీగా రేషన్ బియ్యం స్వాధీనం
127 భస్తాలు పట్టివేత – బోలెరో వాహనం సీజ్
By Ram Reddy
On
మిడ్జిల్ ఏప్రిల్ 13(లోకల్ గైడ్ ):
మిడ్జిల్ మండలం మసిగుండ్లపల్లి గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన భారీ స్థాయిలో రేషన్ బియ్యాన్ని జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు. సోమవారం తెల్లవారుజామున సుమారు ఉదయం 6 గంటల సమయంలో, పక్కా సమాచారం మేరకు జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారులు గ్రామంలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు.
తనిఖీల సందర్భంగా సుల్తాన్ ఇంట్లో అనుమానాస్పదంగా నిల్వ ఉంచిన బియ్యాన్ని పరిశీలించగా, అది ప్రభుత్వానికి చెందిన రేషన్ బియ్యం అని అధికారులు నిర్ధారించారు. వెంటనే సివిల్ సప్లయ్ శాఖ అధికారులకు మరియు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.
ఈ సందర్భంగా ఎన్ఫోర్స్మెంట్ డీటీ వెంకటేశ్వర్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మొత్తం 127 భస్తాలు (52 క్వింటాళ్లు 17 కిలోలు) రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే అక్కడే నిలిపి ఉంచిన అసిఫ్ బోలెరో వాహనాన్ని సీజ్ చేసి మిడ్జిల్ పోలీసులకు అప్పగించారు.
స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని ప్రైవేట్ వాహనాల ద్వారా జడ్చర్లలోని ఎంఎల్ఎస్ పాయింట్‌కు తరలించినట్లు ఎన్ఫోర్స్మెంట్ డీటీ వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు. అక్రమంగా రేషన్ బియ్యం నిల్వ ఉంచిన వ్యక్తిపై అవసరమైన కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
రేషన్ బియ్యం అక్రమ రవాణాపై కఠిన చర్యలు
ప్రభుత్వం ప్రజలకు సరఫరా చేసే రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేయడం, రవాణా చేయడం వంటి చర్యలపై కఠినంగా వ్యవహరిస్తామని అధికారులు హెచ్చరించారు. ప్రజలు కూడా తమ పరిసర ప్రాంతాల్లో ఇలాంటి అక్రమ చర్యలు గమనిస్తే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.
Tags:
About The Author
Latest News
13 Apr 2026 19:42:34
కుత్బుల్లాపూర్ ఏప్రిల్ 13 (లోకల్ గైడ్ ప్రతినిధి)
గాంధీ భవన్ లో రాష్ట్ర అధ్యక్షులు వెంకటస్వామి అధ్యక్షతన ఎన్ ఎస్ యు ఐ రాష్ట్ర కార్యవర్గ
