గణాంక శాస్త్రం బోధించడం ద్వారా.విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించవచ్చు.
తెలంగాణ ఉన్నత విద్య జాయింట్ డైరెక్టర్.
ప్రొఫెసర్ పి. బాల భాస్కర్
మిర్యాలగూడ ఫిబ్రవరి 20 (లోకల్ గైడ్, తెలంగాణ )
కేఎన్ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాల అర్థశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో జరుగుతున్న మూడు రోజుల బేసిక్ క్వాంటిటీటివ్ టెక్నిక్స్ ఇన్ టీచింగ్ ఆఫ్ ఎకనామిక్స్ అనే వర్క్షాప్కు సంబంధించి చీఫ్ గెస్ట్ గా తెలంగాణ ఉన్నత విద్య జాయింట్ డైరెక్టర్ అయినటువంటి ప్రొఫెసర్ పి బాల భాస్కర్ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా బాల భాస్కర్ మాట్లాడుతూ డిగ్రీ కళాశాల విద్యార్థులకు క్వాంటిటీటివ్ టెక్నిక్స్ కు సంబంధించిన సబ్జెక్టు పైన మరింత మెలకువలను నేర్పించే ఉద్దేశంతో కేఎన్ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాల అర్థశాస్త్ర విభాగం డాక్టర్ గుమ్మడి నరేష్ తలపెట్టిన ఈ మూడు రోజుల వర్క్షాప్ ద్వారా అధ్యాపకుల్లో సృజనాత్మకత పెంచడంతోపాటు అధ్యాపకులు విద్యార్థులకు సులభంగా బోధించడానికి ఉపయోగపడుతుంది. అంతేకాక క్వాంటిటీ టు మెథడ్స్ అంటే విద్యార్థుల్లో కొంత భయాందోళనలు ఉంటాయి. వాటిని దూరం చేయడం ఉపాధ్యాయుల యొక్క కర్తవ్యం ముఖ్యంగా ఉపాధ్యాయులు కఠిన తరమైనటువంటి సబ్జెక్టులను సులభతరంగా చేసి బోధించడంలో క్రియాశీలక పాత్ర పోషిస్తారు కాబట్టి వారికి ట్రైనింగ్ ఇచ్చినట్లయితే విద్యార్థులకు మరింత సౌకర్యంగా పాఠాలు అర్ధమవుతాయి.సో ఇందుకుగాను రోసా నుంచి ఆర్థిక సహకారాన్ని పొందే విషయంలోనూ వర్క్ షాప్ నిర్వహణలోనూ డాక్టర్ గుమ్మడి నరేష్ కు మేము అన్ని రకాలుగా సహకరించడం జరిగింది.
ఈ కార్యక్రమం భవిష్యత్తులో కూడా మరి మరోసారి తలపెట్టే స్టాటిస్టిక్స్ ప్రోగ్రాం కూడా ఆర్థిక సహకారాన్ని అందిస్తానని ప్రొఫెసర్ బాల భాస్కర్ అర్థశాస్త్ర విభాగం కు సంబంధించిన డాక్టర్ నరేష్ కు హామీ ఇవ్వడం జరిగింది. అంతేకాక కేఎన్ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాల అడ్మిషన్లు పెంచుకోవడంలోనూ విద్యార్థుల ఉత్తీర్ణతను పెంపొందించడంలోనూ మరింత దృష్టి పెట్టాలని తెలియజేయడం జరిగింది. అలాగే విద్యార్థులకు కూడా బయోమెట్రిక్ విధానాన్ని వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తున్నట్లు తెలియజేశారు. అలాగే కళాశాల ప్రిన్సిపల్ భీమార్జున రెడ్డి యొక్క పనితీరును గురించి మరింత ప్రశంసలు కురిపించడం జరిగింది. భీమార్జును రెడ్డి సారధ్యంలో కళాశాల మరింత అభివృద్ధి చెందాలని ప్రొఫెసర్ బాల భాస్కర్ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అర్థశాస్త్ర విభాగం తలపెట్టిన క్వాంటిటీటివ్ మెథడ్స్ వర్క్ షాప్ కు సంబంధించి ఆర్టిసిపెంట్స్ ను కూడా ప్రశంసించడం జరిగింది.
తెలంగాణ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల జాయింట్ డైరెక్టర్ బాల భాస్కర్ అధ్యక్ష ఉపన్యాసాన్ని గురించి వర్క్ షాప్ డైరెక్టర్ డాక్టర్ గుమ్మడి నరేష్ మాట్లాడుతూ బాల భాస్కర్ సార్ లాంటి జెడి విద్య అనుభవంతో పాటు పరిపాలన అనుభవం కలిగినటువంటి వ్యక్తి కావడం అధ్యాపకులు మనసులో కళాశాలలో ఉన్న సమస్యల పైన స్పష్టమైన అవగాహన ఉన్నటువంటి వ్యక్తి జెడి గా ఉండడం ద్వారా అధ్యాపకుల యొక్క సమస్యలను సులభంగా పరిష్కరించే అవకాశం దొరికిందని కేఎన్ఎం కళాశాలలో జరిగే వర్క్ షాప్ కు చీఫ్ గెస్ట్ గా విచ్చేసి వర్క్ షాప్ పార్టిసిపెంట్స్ తో పాటు వర్క్ షాప్ జరుగుతున్న విధానాన్ని అభినందించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఒక ఉన్నత విద్య ఆఫీసర్ బ్లెస్సింగ్స్ దొరకడం మా పూర్వజన్మ సుకృతం అని కొనియాడారు. కళాశాల ప్రిన్సిపల్ శ్రీ భీమార్జునా రెడ్డి మాట్లాడుతూ జాయింట్ డైరెక్టర్ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టడమే కాకుండా కళాశాల అడ్మిషన్స్ మరింత పెంచి విద్యార్థుల ఉత్తీర్ణత శాతాన్ని పెంచి కళాశాల ఉన్నత శిఖరాలను అధిరోహించడంలో తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని బాల భాస్కర్ గారికి హామీ ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమానికి వర్క్ షాప్ నిర్వహణ నిర్వాహకుడు డాక్టర్ గుమ్మడి నరేష్, కళాశాల ప్రిన్సిపల్ భీమార్జున రెడ్డి క్వాంటిటీ టు మెథడ్స్ పార్టిసిపెంట్స్ కళాశాల బోధన బోధనేతర సిబ్బంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది.
