సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ బోధనలు సమాజానికి మార్గదర్శకం

జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ బోధనలు సమాజానికి మార్గదర్శకం

జగిత్యాల జిల్లా ప్రతినిధి ( లోకల్ గైడ్ ) :
శుక్రవారం తెలంగాణ ప్రభుత్వం జిల్లా గిరిజన సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో జిల్లా సమీకృత  కార్యాలయ సముదాయంలో  సంత్  శ్రీ  సేవాలాల్  మహారాజ్  287వ జయంతి  ఉత్సవాలను  ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి  ముఖ్య అతిధులుగా జిల్లా  కలెక్టర్  బి.సత్య ప్రసాద్ పాల్గొన్నారు.  
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ
సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్  287వ జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. 
సమాజంలోని ప్రజలు అందరు తమ సాంప్రదాయాలు, సంస్కృతులను కాపాడుకుంటూ అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని కోరారు. 
సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, వారి అడుగుజాడల్లో నడవాలని కోరారు. ఆయన ఆలోచనలు, బోధనలు గిరిజన జాతులకు అపారమైన స్ఫూర్తినిచ్చాయని , వారి బోధనలను ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు.  
చెడు అలవాట్లను విస్మరించి  మంచి అలవాట్లను  అలవర్చుకోవాలని  ఉన్నతమైన  జీవన విధానాన్ని పెంపొందించుకోవడానికి మంచి  సంస్కృతులు, సాంప్రదాయాలను  కొనసాగించాలని  తెలిపారు. 
వారి ఆలోచనలు, బోధనలు,  గిరిజన జాతులకు, తెగలకు  ఎంతో  గొప్ప  స్ఫూర్తిని  అందించాయని అలాంటి మహనీయుల బాటలో  సమాజంలో అందరు కలిసికట్టుగా ముందుకు సాగాలని కోరారు.
ఈ కార్యక్రమంలో గిరిజన సాంప్రదాయ వేషధరణ  ధరించి సాంప్రదాయ నృత్య ప్రదర్శనలు  చేసిన  చిన్నారులను ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ అభినందించి శాలువాలతో సత్కరించారు.
ఈ జయంతిని పురస్కరించుకొని  చిన్నారుల సాంప్రదాయ నృత్య ప్రదర్శనలు  మరియు కళాకారుల పాటలు ప్రత్యేకంగా అలరించాయి.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి. రాజ గౌడ్, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి కె.రాజ్ కుమార్, జిల్లా అధికారులు, గిరిజన సంఘ నాయకులు, ఉద్యోగులు, విద్యార్థులు, కలెక్టరేట్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలి  రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలి 
చర్ల : లోకల్ గైడ్ :రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే ఇవ్వాలని బీఆర్ఎస్ కన్వీనర్ దొడ్డి తాతారావురాష్ట్రంలో రిటైర్ అయిన ఉద్యోగులకు పెన్షన్ బెనిఫిట్స్ వెంటనే...
మెనూ పక్కాగా అమలు చేయాలి:జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా
టెక్నీషియన్  కోర్సులకు  దరఖాస్తుల ఆహ్వానం .
కారేపల్లి రైల్వే గ్యాంగ్  హోలీక దిల్ ఖుష్ 
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణను సమర్థవంతంగా అమలు చేయాలి 
శ్రీ భద్రకాళి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు
ప్లాటినం జూబ్లీ వేడుకలలో గౌరవ అతిధిగా హాజరు కావాలని ఆహ్వానం