బిజ్వార్ లో సీసీ రోడ్డు పనులు ప్రారంభం
By Ram Reddy
On
నారాయణపేట మార్చి 29:
బిజ్వార్ లో పాలమూరు ఎంపీ డి కె అరుణ నిధులతో బిజ్వార్ లో బి సి కాలనీ లో సీసీ రోడ్డు పనులను ఆదివారం గ్రామ సర్పంచ్ కొల్లంపల్లి అంజయ్య, ఉప సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి, వార్డు సభ్యులు నేడుగం రాఘ వేంద్ర,దోరోళ్ల జయమ్మ,చెన్నా రెడ్డి, గుడిసె రాజు, వెంకటేష్ గౌడ్, ఎల్లప్ప తదితరులు భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సంద ర్బంగా సర్పంచ్ కొల్లంపల్లి అంజయ్య మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి కేవలం బీజేపీ తోనే సాధ్యం అని అన్నారు. దేశం అభివృద్ధి చెందాలంటే మొదట గ్రామాలు బాగుండాలి అని మాజీ ప్రధాని అటల్ బిహారి వాజపేయి, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ గ్రామ జనాభా ప్రకారం కేంద్ర ప్రభుత్వ నిధు లు నేరుగా గ్రామ సర్పంచ్ ఖాతాలో జామ చేస్తున్నారని తెలిపారు. గతంలో కేద్రం నిధులు గ్రామాలకు మంజూ రై గ్రామాలకు వచ్చే వరకు మొత్తం ఖాళీ అయ్యేవి అని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం లో గత పది సంవత్సరాల నుండి కూడా గ్రామ పంచా యితీకి అరకొర నిధుల వలన అభివృద్ధి జరగడం లేదు అని అన్నారు. కేవలం కేంద్రం నుండి వచ్చిన డబ్బు ల ద్వారానే గ్రామాలలో పనులు జరుగుతున్నా యన్నారు. గ్రామాల అభి వృద్ధి జరుగాలంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా సర్పంచు లకు ప్రత్యేక నిధులు కేటా యించాలని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు జి. రాజప్ప, కృష్ణయ్య, ఆంజనేయులు గౌడ్,పత్తి ఆంజనేయులు,నగేష్ గౌడ్, హెచ్. నర్సింహా, మహేష్ గౌడ్, అశోక్ గౌడ్, నర్సింహా రెడ్డి,వెంకటప్ప,అశోక్,కుర్మప్ప,రామలింగయ్య,తులసిదాస్,ఉప్పు ఆంజనేయులు,తిరుపతి, శివ, రాజు, జగదీశ్ నారాయణ గౌడ్, రామలింగం గౌడ్, వడెప్ప, ఉప్పు రమేష్, చిన్న నర్సింహా తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైట్ అప్:6.రోడ్డు పనులు ప్రారంబించిన సర్పంచ్
_______________________
Tags:
About The Author
Latest News
30 Mar 2026 21:08:53
ఆస్థి పన్ను వసూల్ కోసం ఇళ్లకు వెళ్లిన అధికారులకు సవా లక్షా ప్రశ్నలతో ముచ్చెమటలు పట్టిస్తున్న ఆస్తిపన్నుదారులు. కాలనీలో ఏం అభివృద్ధి చేశారని ఆస్తిపన్ను వసూలుకు
