గాలి గూడెంలో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశo

ముఖ్య అతిథిగా చౌదరిగూడెం. మండలం,కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సలేంద్రంపల్లి రాజు ......

గాలి గూడెంలో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశo

మార్చి 30 (లోకల్ గైడ్): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద గృహప్రవేశ కార్యక్రమాలు మండల వ్యాప్తంగా జోరుగా కొనసాగుతున్నాయి. ప్రతిరోజూ అనేక గృహాలు ప్రారంభమవుతూ లబ్ధిదారుల్లో ఆనందాన్ని నింపుతున్నాయి.

ఈ సందర్భంగా గాలి గూడెం గ్రామానికి చెందిన లబ్ధిదారు క్యత్రా మోని అంజలి (భర్త: జంగయ్య జగన్) గృహప్రవేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సలేంద్రంపల్లి రాజు సతీసమేతంగా ముఖ్య అతిథిగా హాజరై గృహాన్ని ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులను ఆశీర్వదిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.IMG-20260330-WA0295

ఈ సందర్భంగా సలేంద్రంపల్లి రాజు మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో ఇల్లు లేని నిరుపేదలకు అవకాశం లేకపోయిందని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి పేద కుటుంబానికి గూడు కల్పించేందుకు కృషి చేస్తోందన్నారు. మండలంలో ఇంకా పూర్తికాని ఇళ్లను త్వరగా పూర్తి చేసుకోవాలని లబ్ధిదారులకు పిలుపునిచ్చారు.

ప్రతి రోజు గృహప్రవేశాలకు హాజరవుతున్నానని, లబ్ధిదారుల కళ్లలో కనిపిస్తున్న ఆనందం తనకు ఎంతో సంతోషాన్ని ఇస్తోందని ఆయన తెలిపారు. నిరుపేదల పక్షాన ఎప్పుడూ నిలిచేది కాంగ్రెస్ పార్టీనే అని, గతంలో కూడా ఇళ్లను అందించిన ఘనత కాంగ్రెస్‌కే దక్కిందని, భవిష్యత్తులో కూడా ఇదే ధోరణి కొనసాగుతుందని అన్నారు.

అలాగే రేషన్ కార్డులు, రోడ్లు, వీధి దీపాలు, బస్సు సౌకర్యాలు వంటి అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషించిందని ఆయన గుర్తుచేశారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత, శాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని, ముఖ్యంగా చౌదరిగూడెం మండలానికి అధికంగా ఇండ్ల కేటాయింపులో ఎమ్మెల్యే కీలక పాత్ర పోషించారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ వెంకట నరసింహారెడ్డి, గాలి గూడెం సర్పంచ్ స్వప్న, జక్కని రవికుమార్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు.ఎలుకగూడెం సర్పంచ్ సి. బందయ్య, కాసులబాధ సర్పంచ్ కుమార్, లచ్చంపేట సర్పంచ్ భర్త వి. రాములు, గాలి గూడెం మాజీ సర్పంచ్ యాదయ్య, వెంకట్ రాములు, మల్లేష్, వీరన్నపేట్ మాజీ సర్పంచ్ సలీం భాయ్, కాసుల బాధ రాజేష్ ఎల్కిచర్ల శ్రీను లింగం తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

ఎంతరాత్రి వరకైనా సరే ఆస్తి పన్ను వసూలు చేయాల్సిందే - షాద్ నగర్ మున్సిపాల్ కమిషనర్ అధికారులకు హుకుంజారీ. ఎంతరాత్రి వరకైనా సరే ఆస్తి పన్ను వసూలు చేయాల్సిందే - షాద్ నగర్ మున్సిపాల్ కమిషనర్ అధికారులకు హుకుంజారీ.
  ఆస్థి పన్ను వసూల్ కోసం ఇళ్లకు వెళ్లిన అధికారులకు సవా లక్షా ప్రశ్నలతో ముచ్చెమటలు పట్టిస్తున్న ఆస్తిపన్నుదారులు. కాలనీలో ఏం అభివృద్ధి చేశారని ఆస్తిపన్ను వసూలుకు
గాలి గూడెంలో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశo
కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి.
బిజ్వార్ లో సీసీ రోడ్డు పనులు ప్రారంభం 
ఛత్రపతి శివాజీ,అంబేద్కర్ విగ్రహావిష్కరణ భూమి పూజలో
హైదరాబాద్‌లో ఘనంగా ‘యువ భారత్ రన్ 2026’ నిర్వహణ – యువతలో ఫిట్‌నెస్, విలువలకు నూతన దిశ
శాసనసభలో ఆర్‌&బీ శాఖపై మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ప్రసంగం