కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి.

ఐక్య ఉద్యమాలను బలోపేతం చేద్దాం.

కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి.

ఏప్రిల్ 1న బ్లాక్ డే.

నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి .మార్చి 29. (లోకల్ గైడ్)


     కేంద్ర ప్రభుత్వం కార్మికుల పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దుచేసి తెచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలని దేశవ్యాపిత జాతీయ కార్మిక సంఘాల పిలుపుమేరకు ఏప్రిల్ 1న అన్ని గ్రామ, యూనియన్, మండల కేంద్రాల్లో జరుగు నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని  సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు దండెంపల్లి సత్తయ్య పిలుపునిచ్చారు. ఆదివారం కనగల్లు మండలం దోరేపల్లిలో సిఐటియు గ్రామ సమన్వయ కమిటీ జనరల్ బాడీ సమావేశం గ్రామపంచాయతీ కార్యాలయం దగ్గర జరిగింది. ఈ సందర్భంగా సత్తయ్య మాట్లాడుతూ కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాల వలన కార్మిక వర్గానికి అందుతున్న కొద్దిపాటి ప్రయోజనాలను కూడా దూరం చేయడానికి కార్పొరేట్లకు ప్రయోజనాలు కలిగించేందుకు ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరున సమస్యలను తీసుకొని రావడం కోసం కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దుచేసి 4 లేబర్ కోడ్ లను తీసుకువచ్చిందని ఆరోపించారు. లేబర్ కోడ్ రద్దు చేయాలని 29 కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ భారత కార్మిక వర్గం గత ఐదు సంవత్సరాలుగా అనేక ఆందోళన పోరాటాలు నిర్వహించిందని అన్నారు. కోడ్ లకు వ్యతిరేకంగా దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె అన్ని కార్మిక సంఘాలు నిర్వహించగా 30 కోట్ల మంది కార్మికులు సమ్మెలో పాల్గొని నిరసన వ్యక్తం చేయడం జరిగిందని అన్నారు కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ లను మా రాష్ట్రాలలో అమలు చేయమని కేరళ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలలో అసెంబ్లీ లో తీర్మానాలు చేశారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. నవంబర్ 22న నోటిఫికేషన్ చేసిన ప్రభుత్వం ఏప్రిల్ ఒకటి నుండి అమలు చేయాలని చూస్తుందని అన్నారు. ఏప్రిల్ ఒకటి బ్లాక్ డే గా పాటిస్తూ కార్మిక వర్గం అంతా నల్ల రిబెళ్ళతో,నల్ల  జండాలతో అన్ని గ్రామ,యూనియన్, మండల కేంద్రాల్లో నిరసన ర్యాలీలు చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం  సిఐటియు దోరేపల్లి గ్రామ సమన్వయ కమిటీ కన్వీనర్ గా మాధగోని శంకరయ్య, కో కన్వీనర్ గా దాసరి కిరణ్ లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం మండల ఉపాధ్యక్షులు బైరగోని కాశీం సిఐటియు అనుబంధ సంఘాల గ్రామ నాయకులు వంగూరి రజిత దాసరి హేశ్వరి, చినపాక సతీష్ గాజుల నగేష్ పొదిలి శ్రీరాములు బక్క లింగయ్య, చినపాక ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

ఎంతరాత్రి వరకైనా సరే ఆస్తి పన్ను వసూలు చేయాల్సిందే - షాద్ నగర్ మున్సిపాల్ కమిషనర్ అధికారులకు హుకుంజారీ. ఎంతరాత్రి వరకైనా సరే ఆస్తి పన్ను వసూలు చేయాల్సిందే - షాద్ నగర్ మున్సిపాల్ కమిషనర్ అధికారులకు హుకుంజారీ.
  ఆస్థి పన్ను వసూల్ కోసం ఇళ్లకు వెళ్లిన అధికారులకు సవా లక్షా ప్రశ్నలతో ముచ్చెమటలు పట్టిస్తున్న ఆస్తిపన్నుదారులు. కాలనీలో ఏం అభివృద్ధి చేశారని ఆస్తిపన్ను వసూలుకు
గాలి గూడెంలో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశo
కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి.
బిజ్వార్ లో సీసీ రోడ్డు పనులు ప్రారంభం 
ఛత్రపతి శివాజీ,అంబేద్కర్ విగ్రహావిష్కరణ భూమి పూజలో
హైదరాబాద్‌లో ఘనంగా ‘యువ భారత్ రన్ 2026’ నిర్వహణ – యువతలో ఫిట్‌నెస్, విలువలకు నూతన దిశ
శాసనసభలో ఆర్‌&బీ శాఖపై మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ప్రసంగం