డ్రగ్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహణ.

కార్యక్రమంలో భాగంగా బంట్వారం మండలంలోని రొంపల్లి గ్రామ పాఠశాలలో

డ్రగ్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహణ.

లోకల్ గైడ్/బంట్వారం:

ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా బంట్వారం మండలంలోని రొంపల్లి గ్రామ పాఠశాలలో మంగళవారం డ్రగ్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. యువతలో పెరుగుతున్న మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బంట్వారం ఎస్‌ఐ విమల,మాట్లాడుతూ.. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని,ముఖ్యంగా డ్రగ్స్ వంటి ప్రమాదకర అలవాట్లకు లొంగిపోకూడదని సూచించారు. డ్రగ్స్ వాడకం వల్ల ఆరోగ్యానికి మాత్రమే కాకుండా భవిష్యత్తుకూ తీవ్రమైన నష్టం కలుగుతుందని ఆమె హెచ్చరించారు. యువత తమ లక్ష్యాలపై దృష్టి పెట్టి మంచి మార్గంలో ముందుకు సాగాలని సూచించారు.అనంతరం విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఎస్‌ఐ విమల స్పోర్ట్స్ సామగ్రిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు,పాల్గొన్నారు.ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో డ్రగ్స్‌పై అవగాహన పెంపొందించి, సమాజాన్ని డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దడం లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.

Tags:

About The Author

Latest News

హుస్నాబాద్‌లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం హుస్నాబాద్‌లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం
సిద్దిపేట జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్ తెలంగాణ)  మార్చి17:మొక్కజొన్న రైతుల సౌకర్యార్థం హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినట్లు రాష్ట్ర రవాణా మరియు...
మే 11వ తేదీ నుండి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా జనగణన  మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్త ప్రకటన 
సహజ వ్యవసాయం వైపు రైతులు ముందుకు రావాలి
డ్రగ్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహణ.
వార్డ్ మెంబర్లకు రెండో విడత శిక్షణ విజయవంతం
గుండాల మండలంలో కలెక్టర్ అంకిత్ ఆకస్మిక తనిఖీలు – సేవల నాణ్యతపై కఠిన సమీక్ష
విజయలక్ష్మి హాస్పిటల్ తనిఖీ. షోకాస్ నోటీసులు జారీ.