సిద్దిపేట జిల్లా ప్రతినిధి(లోకల్ గైడ్ తెలంగాణ)
సిద్దిపేట సమీకృత జిల్లా కార్యాలయం లో ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను సంబంధిత అధికారులు సత్వరంగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల వినతులను జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్‌తో కలిసి కలెక్టర్ స్వీకరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యలు పరిష్కారం అవుతాయనే నమ్మకంతో ప్రజావాణి కార్యక్రమానికి వచ్చి ఫిర్యాదులు అందజేస్తారని, వాటిని అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి అర్హతల మేరకు వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల సమస్యలను ప్రాధాన్యతగా తీసుకుని పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని తెలిపారు.ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి మొత్తం 217 దరఖాస్తులు స్వీకరించినట్లు కలెక్టర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో డీఆర్‌ఓ నాగరాజమ్మ, ఏఓ రాజ్‌కుమార్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.