రైతు భరోసా పై సి ఎం ప్రకటన చేయాలి.
సామాజిక కార్యకర్త నర్సింహ
నారాయణపేట ఫిబ్రవరి 20:
తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి లేదా సంబంధిత మంత్రులు యాసంగి రైతు భరోసా ఇస్తారా లేదా స్పష్టం చేయాలని సామాజిక కార్య కర్త హెచ్.నర్సింహా ఒక ప్రకట నలో కోరారు.మున్సిపల్ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వా త కూడా ప్రభుత్వం రైతు భరో సా ఇవ్వకుండా కాలయాపన చేయడం చూస్తూ ఉంటే ఈ సారి కూడా యాసంగి సీజన్ రైతు భరోసా ఎగ్గొట్టేటట్లు ఉంది అన్న అనుమానం వ్యక్తం చేశారు. యాసంగి సీజన్ ప్రారంభం అయి రెండు నెలలు పూర్తి అయిన కూడా రైతు భరోసా డబ్బులు ఇవ్వ నందుకు రైతులు ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల ద్వారా డబ్బులు తెచ్చి పెట్టుబడులు పెడుతు న్నారని తెలిపారు.ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం ఖరీఫ్, యాసంగి తో సంబంధం లేకుండా పంటలు సాగు చేసే భూములకు సంవత్సరానికి 12 వేల రైతు భరోసాను సరి అయిన సమయంలో రైతుల ఖాతాలలో జమ చేయాలని డిమాండ్ చేశారు.
ఫోటో రైట్ అప్:3.సామాజిక కార్యకర్త నర్సింహ
_______________________
