నారాయణపేట ఫిబ్రవరి 19:
విద్యార్థులు ఏకాగ్రతతో చదివి లక్ష్యం సాధించాలని నారాయణపేట శ్రీ సాయి జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ రామకృష్ణఅన్నారు.గురువారం కళాశాలలో ఇంటర్మీడి యట్ చదువుతున్న ద్వితీ యుయ సంవత్సరం విద్యార్థు లకు వీడ్కోలు సమావేశం ప్రైవేటు ఫంక్షన్ హాల్లోయూత్ ఫెస్ట్ పేరిట ఘనంగా శ్రీ సాయి జూనియర్ కళాశాల నిర్వ హించింది. ఈ సంద ర్భంగా ఈ సంవత్సర కాలం పాటు వివిధ దినోత్సవల సంద ర్భంగా నిర్వహించిన స్పోర్ట్స్ ఫెస్ట్,కల్చరల్ పేస్ట్,క్రికెట్ పోటీలలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులను ప్రధానం చేశారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ మాట్లా డుతూ విద్యార్తి లోకం కొత్త కొత్త ఆలోచనలతో నూతన ఆవిష్కరణలను ఏకాగ్రతతో సాధించాలని కోరారు. మనిషి భవిష్యత్తును తీర్చిదిద్దేది కేవలం చదువు మాత్రమేనని అన్నారు.అందుకు గాను చదువును నిర్లక్ష్యం చేయ కుండా ఉన్నత స్థానాలకు చేరాలని ఆకాక్షించారు. నారాయణపేటలో దాదాపు 25 సంవత్సరాల నుండి తక్కువ ఫీజుతో నాణ్యమైన ఇంటర్ విద్యను నైతిక విలువలతో అందజేస్తు న్నామని అన్నారు. యూత్ ఫెస్ట్ కార్యక్రమంలో విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్య క్రమంలో శ్రీ సాయి జూనియర్ కళాశాల యాజమాన్యం జనార్దన్ రెడ్డి,శంకర్ శశి కుమార్, రఘుపతి రెడ్డి, గరిడీ రఘుపతి, కళాశాల అధ్యాపక బృందం రవి బాబు,రాజు, వెంకట్ రెడ్డి, కృష్ణయ్య,రాజశేఖర్, దీపక్,రామస్వామి, చంద్ర శేఖర్, విశ్వనాథ్, ఉమా, కవిత, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైట్ అప్ :అవార్డులు అందజేస్తున్న ప్రిన్సిపాల్
______________________