శివాజీ జయంతి వేడుకలు శాంతియుతంగా నిర్వహించుకోవాలి
పటిష్ట బందోబస్తు ముందే అనుమతి పొందాలి
జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్
నారాయణపేట ఫిబ్రవరి 18:
శివాజీ జయంతి సందర్భంగా నారాయణపేట జిల్లా పరిధి లో మొత్తం 54 శోభయా త్రలు, బైక్ ర్యాలీలు నిర్వహిం చనున్న నేపథ్యంలో పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఒక ప్రకటనలో తెలిపారు.శివాజీ జయంతి శోభాయాత్ర, బైక్ ర్యాలీలకు ముందుగా పోలీసుల అనుమతి తప్పనిసరి అని, ర్యాలీ నిర్వహించే సమయం లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిం దని తెలిపారు. నూతన శివాజీ విగ్రహాలను ప్రతిష్టించా లంటే తప్పనిసరిగా పరిమి షన్ తీసుకోవాలని అందుకు నిర్వాహకులు, ఆర్గనైజర్లు బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు.ర్యాలీలు నిర్వహిం చే సమయంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ట్రాఫిక్ డైవర్షన్ చేయడం జరుగుతుందని అందుకు నిర్వాహకులు సమయపా లన తప్పకుండా పాటించా లని సూచించారు. శోభయా త్ర నిర్వహించే సమయంలో డీజేలు, అధిక శబ్ద పరిక రాలు, లేజర్ లైట్లు వినియో గించరాదని స్పష్టం చేశారు. అశాంతి కలిగించే నినాదాలు, ప్రవర్తన చేయరాదని, మహి ళలు, పిల్లలు, వృద్ధులకు ఇబ్బంది కలగకుండా జాగ్ర త్తలు తీసుకోవాలని సూచించారు.మద్యం సేవించి ర్యాలీలో పాల్గొనడం నిషేధ మని, అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే లోకల్ పోలీసులకు లెడ్ డయల్ 100 కి సమాచారం ఇవ్వాల ని కోరారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్ట రీత్యా కఠిన చర్యలు తీసు కుంటామని హెచ్చరించారు. సోషల్ మీడియాలో ఇతరు లను కించపరిచే విధంగా పోస్టులు చేయరాదని, అలాంటి వారిపై చట్టపకరం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్పీ హెచ్చ రించారు.శాంతియుత వాతా వరణంలో ఉత్సవాలు నిర్వ హించేందుకు నిర్వాహకులు పోలీసులకు పూర్తి సహకారం అందించాలని ఎస్పీ కోరారు.
ఫోటో రైట్ అప్:5.ఎస్పి వినీత్
______________________
