భూమి సారమే భవిష్యత్తు – సేంద్రియ మార్గంలో ముందుకు నాక్రో బయోటెక్

హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో సేంద్రియ ఎరువులపై అవగాహన కార్యక్రమం

భూమి సారమే భవిష్యత్తు – సేంద్రియ మార్గంలో ముందుకు నాక్రో బయోటెక్

కుత్బుల్లాపూర్ ఫిబ్రవరి 18 (లోకల్ గైడ్ ప్రతినిధి) 

నాక్రో బయోటెక్ సంస్థ ఆధ్వర్యంలో “భూమికి జీవం – రేపటి తరానికి జీవనాధారం” అనే అంశంపై రైతులకు అవగాహన కార్యక్రమం ఈరోజు హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో సేంద్రియ ఎరువులు, జీవ ఎరువులు మరియు రసాయన ఎరువుల మధ్య తేడాలను వివరించారునిపుణులు మాట్లాడుతూ — రసాయన ఎరువులు భూమి సారాన్ని తగ్గిస్తాయని, అయితే సేంద్రియ ఎరువులు భూమికి జీవం నింపుతాయని చెప్పారు. సహజ ఎరువుల వాడకంతో పంటల ఉత్పత్తి పెరిగి, భూమి సారధ్యం సుస్థిరమవుతుందని వివరించారు. రైతులు రసాయనాలపై ఆధారపడకుండా, సేంద్రియ మార్గంలో సాగు చేస్తేనే భవిష్యత్తు తరాలకు ఆరోగ్యకరమైన ఆహారం అందుతుందని అన్నారు.కార్యక్రమంలో నాక్రో బయోటెక్ ప్రతినిధులు మాట్లాడుతూ — “భూమి బలంగా ఉంటే రైతు బలంగా ఉంటాడు, రైతు బలంగా ఉంటే దేశం బలంగా ఉంటుంది” అని పిలుపునిచ్చారు. సేంద్రియ వ్యవసాయం భూమిని కాపాడడమే కాక, రైతు ఆదాయాన్ని పెంచే మార్గమని పేర్కొన్నారు.
రైతులు ఈ మార్పులో భాగమవ్వాలని, సేంద్రియ పద్ధతుల ద్వారా సహజ సంపదను కాపాడి పర్యావరణ సమతుల్యతను నిలబెట్టాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.

Tags:

About The Author

Latest News

మంత్రి వాహనంపై దాడి చేసిన వారిపై కేసు నమోదు  మంత్రి వాహనంపై దాడి చేసిన వారిపై కేసు నమోదు 
మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్) రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ పరిధి రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని క్యాతనపల్లి మున్సిపల్ చైర్మన్,వైస్ చైర్మన్ ఎన్నిక...
కార్మికుల హక్కులను కాలరాసేందుకే కేంద్ర సర్కార్ లేబర్ కోడ్ తెచ్చారు.                                                                    
గుండ్లగడ్డ  కిష్ట బావి శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం
భూమి సారమే భవిష్యత్తు – సేంద్రియ మార్గంలో ముందుకు నాక్రో బయోటెక్
ధ్రువపత్రాలు అందుకున్న బి ఆర్ ఎస్ కౌన్సిలర్లు 
పీఎం విశ్వకర్మ లబ్ధిదారులకు అవగాహన కార్యక్రమం
ప్రధాని, రాష్ట్రపతి నుంచి ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు