పేదల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం.

పరిగి ఎమ్మెల్యే టి. రామ్మోహన్ రెడ్డి.

పేదల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం.

తుర్కఎనెకే పల్లి గ్రామానికి చెందిన లబ్ధిదారులకు ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ.

 

తెలంగాణ,(లోకల్ గైడ్) పరిగి.

కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడు పేదల సంక్షేమానికి పాటుపడే ప్రభుత్వమని పరిగి ఎమ్మెల్యే టి .రామ్మోహన్ రెడ్డి అన్నారు. పూడూరు మండల పరిధిలోని తుర్కఎనికే పల్లి గ్రామానికీ చెందిన బుచ్చయ్య గౌడ్, గుంతపల్లి. రాములుకు పూ డూరు మండల బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి సి ప్రభాకర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పరిగి ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వమన్నారు.గత టిఆర్ఎస్ పార్టీ సామాన్య ప్రజల ఇబ్బందులను ఎంత మాత్రం పట్టించుకోకుండా తీవ్ర నిర్లక్ష్యం చేసిందన్నారు . కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి పేదవాడికి అండగా నిలిచి కార్పొరేట్ ఆసుపత్రిలో ఉచిత పివైద్యం చేయించి ఖర్చులను ప్రభుత్వమే భరించి ఆ కుటుంబానికి అండగా నిలుస్తుందని లబ్ధిదారులతో అన్నారు.రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తుర్క ఎనికే గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని ఎమ్మెల్యే కోరారు.ఈ కార్యక్రమంలో పూ డూరు మండల బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి సి.ప్రభాకర్, బుచ్చయ్య గౌడ్ గుంతపల్లి రాములు, గ్రామ మాజీ డిప్యూటీ సర్పంచ్ చింతలపల్లి అంజయ్య, నవీన్ కుమార్ లు పాల్గోన్నారు.

Tags:

About The Author

Latest News

నిజామాబాద్ జిల్లా – చరిత్ర, భౌగోళిక విశేషాలు మరియు ప్రాముఖ్యత      నిజామాబాద్ జిల్లా – చరిత్ర, భౌగోళిక విశేషాలు మరియు ప్రాముఖ్యత    
నిజామాబాద్ జిల్లా త్రికూట, రాష్ట్రీకూట వంశాల పాలనను, నిజాం కాలపు వారసత్వాన్ని సాక్షిగా నిలిచిన భూమి. చారిత్రక కోటలు, దేవాలయాలు, జలాశయాలు, అరణ్యాలు, విద్యా సంస్థలు, మరియు...
ఘనంగా మాలకట్ట మైసమ్మ బోనాల పండుగ 
ఏడాది పాటు ఉచిత మెగా క్యాన్సర్ వైద్య శిబిరం
ఆరోగ్యకరమైన పిల్లలు ఆరోగ్యకరమైన దేశం" డాక్టర్ మురళి నాయక్ శాసనసభ్యులు
విద్యుత్ వినియోగదారుల సమస్యల సత్వర పరిష్కారానికి కృషి..!!
టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ను మర్యాదపూర్వకంగా
రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం చెక్కుల పంపిణీ