కుల మతాలకు అతీతంగా రాఖీ పౌర్ణమి.
- ముస్లిం సోదరులకు రాఖీ కట్టిన హిందూ సోదరీమణులు.
- బహుమతులు అందించి ఆనందాన్ని పంచుకున్న సోదరులు.
- మాజీ కోఆప్షన్ మెంబర్ నసీర్ ఇంట్లో రాఖీ పండుగ సందడి.
లోకల్ గైడ్/తాండూర్:పెద్దేముల్ మండల పరిధిలోని వివిధ గ్రమాలలో రాఖీ పౌర్ణమి వేడుకలను కుల మతాలకు అతీతంగా ఘనంగా జరుపుకున్నారు.మండల పరిధిలోని ఘాజీపూర్ గ్రామంలో మాజీ కోఆప్షన్ నెంబర్ నసీర్ ఇంట్లో...సోదరభావం,సౌహార్ధానికి ప్రతీకగా...హిందూ సోదరీమణులు కోటం అఖిల,శిరీష తమ ముస్లిం సోదరుల చేతులకు రాఖీలు కట్టి,ఆయుష్షు,శ్రేయస్సు కోరారు.ఈ క్రమంలో రాఖీ కట్టించుకున్న ముస్లిం సోదరులు సోయాబ్, ఫిరోజ్ లు కూడా తమ సోదరీమణులకు బహుమతులు అందించి ఆనందాన్ని పంచుకున్నారు.మన మధ్య మతం అనే గోడలు లేవు, సోదరభావమే మన బంధం" అని ఘాజీపూర్ గ్రామానికి చెందిన మాజీ కోఆప్షన్ సభ్యులు నసీర్ కుమారులు షోయబ్,ఫిరోజ్ తెలిపారు.కాగా సమాజంలో ఐక్యతకు ఈ పండుగ వేదిక అయింది.హిందూ–ముస్లిం సోదరభావానికి ఈ వేడుక ఒక మంచి సందేశాన్ని అందించినట్లు పెద్దలు అభిప్రాయపడ్డారు.
About The Author
