ఖమ్మం లోకల్ గైడ్ , జనవరి 24 :
విద్యార్థి దశలోనే ఉన్నత లక్ష్యాలను ఏర్పచుకోనీ. తల్లిదండ్రుల ఆకాంక్ష అనుగుణంగా విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలనీకారేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎన్.విజయకుమారి అన్నారు.శుక్రవారం కళాశాలలో వార్షికోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన కళాశాల స్థలదాత నేదునూరి నరేష్,కుమ్మరి కుంట్ల నాగేశ్వరరావు,ప్రెస్ క్లబ్ అధ్యక్షులు భీమవరం శ్రీనివాసరావులు మాట్లాడుతూ...విద్యార్థులు చక్కగా చదువుకోవాలంటే లెక్చరర్లు చెప్పిన విధంగా నడుచుకొని చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ మంచి ప్రవర్తన ద్వారా మంచి విద్యతో మీ జీవితంలో స్తిరపడాలనే లక్ష్యంతో మీరు ముందుకు వెళ్లాలని అన్నారు.ఈ కళాశాలలో చదువుకున్న వారు ఎంతో మంది ప్రయోజకులు అయ్యారని వారి మాదిరిగానే మీరు కూడా మంచిగా చదువుకొని ఉన్నత స్థానంలో ఉండే విధంగా మీ భవిష్యత్తును సరిదిద్దుకోవాలని అన్నారు.విద్యార్థుల క్రమశిక్షణ, ఉత్తమ ఫలితాల సాధనకై ప్రభుత్వ కళాశాల బృందం విశేష కృషిని కరమరుస్తున్నారని అన్నారు.ప్రిన్సిపల్ ఎన్.విజయకుమారి మాట్లాడుతూ రాబోయే వార్షిక పరీక్షలకు ప్రణాళికయుతంగా చదివి ఉత్తమ ఫలితాలు సాధించి కళాశాలకు,అధ్యాపకులకు, తల్లిదండ్రులకు మంచిపేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.అదేవిధంగా కళాశాలలో ఇటీవల నిర్వహించిన క్రీడా పోటీల్లో గెలుపొందిన విజేతలకు ముఖ్య అతిధుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.అనంతరం అతిథులకు శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో కారేపల్లి జడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయుడు శ్యామ్,ప్రభుత్వ ఉపాధ్యాయురాలు లలిత,అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ జయ,బోధన సిబ్బంది సుధారాణి, కవిత,మదన్,బోధ నేతర సిబ్బంది,విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.