భూపాల చారి గురుస్వామి ఆధ్వర్యంలో ఐదవ సంవత్సరం శివ పాదయాత్ర. అల్పాహార దాతగా లోకల్ గైడ్ ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ చిలకమర్రి రాంరెడ్డి చిలకమర్రి రాంరెడ్డి సేవలు అందించారు.
నాల్గవ రోజు అచ్చంపేట: నడుంపల్లి గ్రామంలో రాత్రి బస – 500 పైగా భక్తుల పాల్గొనడం
లోకల్ గైడ్ అచ్చంపేట:
ఈ సందర్భంగా సాయంత్రం సమయంలో అల్పాహార దాతగా చిలకమర్రి రాంరెడ్డి సేవలు అందించారు. కార్యక్రమంలో భూపాల చారి, సత్యం , యాదయ్య యాదవ రెడ్డి తదితర గురు స్వాములు రామ్ రెడ్డిని అభినందించి శాలువతో సత్కరించి ఆశీర్వదించారు. సర్వలోక రక్షకుడు శ్రీశైలం మల్లికార్జున స్వామి కరుణా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు.
రామ్ రెడ్డి మాట్లాడుతూ తాను 16 సార్లు మాల వేసి ఒకాసారి పాదయాత్ర చేసిన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. భూపాల చారి గారి ఆధ్వర్యంలో ఐదోసారి ఈ పాదయాత్ర జరగడం ఆనందదాయకమని, ఎంతో కష్టతరమైన ఈ యాత్రను క్రమశిక్షణ భక్తి భావంతో చేపట్టడం అభినందనీయమని కొనియాడారు.
భూపాల చారి గురుస్వామి మాట్లాడుతూ ప్రస్తుతం 380 మందికి పైగా శివ స్వాములతో పాదయాత్ర కొనసాగుతున్నట్లు తెలిపారు. భక్తి భావాన్ని పెంపొందిస్తూ, హిందూ ధర్మ పరిరక్షణతో పాటు ఆధ్యాత్మిక చింతనను పెంచే లక్ష్యంతో శిష్యులకు ఎప్పటికప్పుడు బోధనలు అందిస్తున్నట్లు చెప్పారు. ఈ పాదయాత్ర శనివారం రాత్రికి శ్రీశైలం చేరుకుంటుందని తెలిపారు.
శివ స్వాములతో పాటు సివిల్ స్వాములు కూడా పాదయాత్రలో పాల్గొనడం విశేషం. ప్రస్తుతం 500 మందికి పైగా శివస్వాములు భక్తులు పాదయాత్రలో కొనసాగుతుండగా, ఉమామహేశ్వరం వద్ద మరో 100 మంది భక్తులు కలుస్తారని గురుస్వామి వెల్లడించారు.
యాత్ర సందర్భంగా ముందస్తుగా ఒక బృందం వెళ్లి బస ఏర్పాట్లు చేయడం, వంట తదితర సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని స్వాములు తెలిపారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన సివిల్ స్వాములు వంటలు, బస, ఇతర సేవల ద్వారా సహకారం అందిస్తున్నారని పేర్కొన్నారు. ప్రజల నుంచి అన్ని గ్రామాల్లో మంచి ఆదరణ లభిస్తున్నట్లు తెలిపారు.
ఈ ఏడాది 21రోజుల మండలం, 11రోజుల మండలం లేకుండా కేవలం మండల 41రోజుల దీక్ష మాత్రమే చేపట్టాలని కఠినమైన నియమాలు తీసుకువస్తున్నట్లు గురుస్వామి చెప్పారు. వచ్చే సంవత్సరంలో కూడా ఈ పాదయాత్రను కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ఎలుకగూడెం గ్రామానికి చెందిన సివిల్ స్వాములు ఈ ఏడాది వంట సేవలు అందిస్తూ తమ భక్తిని చాటుకుంటున్నారు. ఈ సేవలను పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని వారు తెలిపారు.
సమాజం బాగుండాలి, అందరూ కలసికట్టుగా ఉండాలనే నిస్వార్థ భావనతో ఈ పాదయాత్ర కొనసాగుతుందని స్వాములు తెలిపారు. యాత్ర ముగిసిన అనంతరం శివరాత్రి వరకు దీక్ష కొనసాగిస్తామని గురు స్వామి వెల్లడించారు..jpg)
