నిమజ్జనం సందర్భంగా12 ప్రదేశాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఏ. అప్పయ్య

నిమజ్జనం సందర్భంగా12 ప్రదేశాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు

హనుమకొండ జిల్లా ప్రతినిధి(లోకల్ గైడ్)

శ్రీ వినాయక ప్రతిమల నిమజ్జనం సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం 12 ప్రదేశాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినట్లు , 108 వాహనాలను కూడా అందుబాటులో ఉంచినట్లు హనుమకొండ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఏ. అప్పయ్య తెలియజేశారు. మూడు షిఫ్ట్ ల లో కూడా వైద్యాధికారి సిబ్బందిని , అవసరమైన మందులు అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. నిన్న బంధం చెరువు , సిద్దేశ్వరగుండం, హసన్ వర్తి సందర్శించి ఈ రోజు కటాక్ష పూర్, పెద్దాపూర్ చెరువు, ప్రగతి సింగారం బ్రిడ్జి, గుండ్ల సింగారం చెరువు, కమలాపూర్ ,హసన్పర్తి ,సిద్దేశుని గుండం,బంధం చెరువు లలో ఏర్పాటుచేసిన వైద్య శిబిరములను ఆయన సందర్శించి తగు సూచనలు చేయడం జరిగింది. ఒక్కో షిఫ్టుకు 60 మంది చొప్పున మొత్తం 180 మంది వైద్య సిబ్బందిని డిప్యూటేషన్ చేయడం జరిగిందన్నారు. ఈ ప్రత్యేక వైద్య శిబిరాలలో చిన్నచిన్న రుగ్మత లకు 168 మందికి చికిత్స అందించడము జరిగిందని ఆయన వివరించారు. వైద్యాధికారులు డాక్టర్ స్వాతి, డాక్టర్ సాయి కృష్ణ, డాక్టర్ నాగరాజు , డాక్టర్ శాంతి ప్రియ,డాక్టర్ నవీన్,డాక్టర్ కవిత, డాక్టర్ రోహిత్, డాక్టర్ విజయ రెడ్డి , డాక్టర్ ఇర్ఫాన్, డాక్టర్ సౌమ్య, డాక్టర్ సురేష్ ,డాక్టర్ సాయిశ్రీ సూపర్వైజర్లు ఏఎన్ఎంలు ఆశాలు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News