సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులదే కీలక పాత్ర -ఎంఈఓ మనోహర్.
తల్లిదండ్రులు జన్మనిస్తే ఉపాధ్యాయులు జీవితాన్ని తీర్చిదిద్దుతారు.. ఎన్ కె రాజేంద్ర ప్రసాద్ రావు..
ఉపాధ్యాయుని కీర్తి అతని విద్యార్థుల్లో కనిపించాలి. డివిఎన్ స్వామి
లోకల్ గైడ్ షాద్ నగర్ :
ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ట్రస్మా షాద్‌నగర్ ( తెలంగాణ రికగ్నైసేడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్) ప్రెసిడెంట్ రమణారెడ్డి కార్యదర్శి వంశీ కృష్ణ అద్వర్యం లో "డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు – 2025” కార్యక్రమం సాయి రాజా కన్వెన్షన్ హాల్, నాగులపల్లి రోడ్, షాద్‌నగర్లో ఘనంగా నిర్వహించడం జారింది .ఈ కార్యక్రమంలో షాద్‌నగర్ పట్టణంలోని 46 పాఠశాలలకు చెందిన ప్రీ ప్రైమరీ,ప్రైమరీ,హైస్కూల్ 180మంది ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు అందజేయడం జరింది.
ముఖ్య అతిథిగా హాజరైన టీ. మనోహర్ సర్ (మండల విద్యాధికారి – ఫరూక్‌నగర్ మండలం) ఉపాధ్యాయులు సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారనిl కొనియాడారు. ఉపాధ్యాయులకు గౌరవం ఇవ్వడం మన సమాజ బాధ్యత అని తెలిపారు.
గౌరవ అతిథిగా పాల్గొన్న రాజేంద్ర ప్రసాద్ (టాగోర్ హై స్కూల్ కరస్పాండెంట్, టిఆర్‌ఎస్‌ఎంఏ సీనియర్ సభ్యుడు) పాఠశాలల నిర్వహణలు ఉపాధ్యాయులకు అండగా ఉండాలి, విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంలో ప్రతిఒక్కరి పాత్ర ఉందన్నారు.
ప్రత్యేక అతిథిగా హాజరైన డి.వి.ఎన్. స్వామి (ప్రిన్సిపల్ – షాద్‌నగర్ ఇంగ్లిష్ మిడియం స్కూల్, టిఆర్‌ఎస్‌ఎంఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు) ఆధునిక శిక్షణా విధానాలు, మారుతున్న విద్యా అవసరాలపై ఉపాధ్యాయులు సన్నద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమం లో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యం మరియు ప్రిన్సిపాల్స్ రమణా రెడ్డి,కె.వంశీకృష్ణ,రఫత్సుల్తానా,స్వాతిరెడ్డి,ఆనంద్ ,రిజ్వాన్,భీమ్ శంకర్సి,మధుసూధన్,యూసఫ్,రాజన్.ఆనంద్,కె. సతీష్ ,కల్పన,సుధాకర్ రెడ్డి,వీరేష్,రాజు,రవి ప్రకాష్,పావని,
నరేంధర్ ,వెంకట రమణ,వెనిలా,ఆశిష్ బాబు,సాంకుట్టి,నవీన్ కుమార్,కవిత, తిరుపతయ్య,పాల్గొన్నారు.