గణేష్ నిమజ్జన కార్యక్రమానికి సర్వం సిద్ధం

కొత్తగూడెం సూపర్ బజార్ సెంటర్ లో భారీ స్వాగత వేదిక ఏర్పాటు 

గణేష్ నిమజ్జన కార్యక్రమానికి సర్వం సిద్ధం

జిల్లా నలుమూలల నుంచి భద్రాచలం తరలి రానున్న వేలాది విగ్రహాలు 

కొత్తగూడెం. లోకల్ గైడ్ :   

 సెప్టెంబర్ 27 న ప్రారంభం అయిన వినాయక చవితి ఉత్సవాలు శనివారం నిమజ్జన కార్యక్రమంతో ముగియనున్నాయి. జిల్లా నలుమూలల నుంచి మాత్రమే కాకుండా ఖమ్మం, నల్గొండ తదితర జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున విగ్రహాలు భద్రాచలం గోదావరి నది తీరానికి తరలి రానున్నాయి. ఇందుకోసం అధికార యంత్రాంగం విసృత ఏర్పాట్లు చేసింది. భారీ క్రెన్లు, గజ ఈత గాళ్ళను సిద్దంగా ఉంచారు. శనివారం అర్ధరాత్రి వరకు ఈ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగనుంది. జిల్లా కలెక్టర్ జితేష్ వి పటేల్ నేతృత్వంలో అధికార యంత్రాంగం ఇందుకు సంబందించిన ఏర్పాట్లలో నిమగ్నమైంది. జిల్లా కేంద్రం కొత్తగూడెం పట్టణంలో విశ్వ హిందూ పరిషత్, గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సూపర్ బజార్ సెంటర్ వద్ద భారీ స్వాగత వేదిక ఏర్పాటు చేశారు. గత 40 ఏళ్లుగా ఈ అనవాయితీ కొనసాగుతుంది. ఈ ఏడాది కూడా ఆ సంప్రదాయం కొనసాగిస్తూ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఉత్సవ కమిటీ అధ్యక్షులు లక్ష్మణ్ మీడియకు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. నేటి సాయంత్రం 4.00గంటలకు ప్రకాశం స్టేడియంలో గణపతికీ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అక్కడి నుంచి శోభా యాత్రగా బస్ స్టాండ్ నుంచి సూపర్ బజార్ వద్ద ఏర్పాటు చేసిన వేదిక వద్ద స్వాగతం అందుకుని నిమజ్జనం నిమిత్తం భద్రాచలం బయలుదేరుతాడని వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హాజరు కానున్నారు అని తెలిపారు.

Tags:

About The Author

Latest News