సిద్ధిపేటలో డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ఉక్కుపాదం.
19 మందికి రూ1.93 లక్షల జరిమానా
By Ram Reddy
On
సిద్దిపేట జిల్లా ప్రతినిధి(లోకల్ గైడ్ తెలంగాణ)
పట్టుబడిన వారిని మార్చి 24, 2026న సిద్ధిపేట స్పెషల్ సెకండ్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ శ్రీ కాంతారావు గారి ముందు హాజరుపరచగా, విచారణ అనంతరం మొత్తం రూ.1,93,000 జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది.అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపిన ఇద్దరికి కలిపి రూ.10,000 జరిమానా విధించారు.
ఈ సందర్భంగా ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రతిరోజూ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మద్యం సేవించి వాహనం నడపడం తమకే కాకుండా ఇతరులకు కూడా ప్రమాదకరమని హెచ్చరించారు.
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వారికి కోర్టు ద్వారా రూ.10,000 వరకు జరిమానా విధించడం జరుగుతుందని, దీని ద్వారా ప్రజల్లో అవగాహన పెరుగుతుందని పేర్కొన్నారు. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే ఒక్కొక్కరికి రూ.5,000 జరిమానా విధించబడుతుందని స్పష్టం చేశారు.
Tags:
About The Author
Latest News
04 Apr 2026 20:48:16
హనుమకొండ జిల్లా ప్రతినిధి ఏప్రిల్04(లోకల్ గైడ్
హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో ఆరోగ్య వారోత్సవాల నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్,ప్రజా...
