ఆళ్లపల్లిలో జిల్లా కలెక్టర్ అంకిత్ పర్యటన

​క్షేత్రస్థాయిలో పర్యటనలు పెంచి ప్రజా సమస్యలపై వెంటనే స్పందించాలి

ఆళ్లపల్లిలో జిల్లా కలెక్టర్ అంకిత్ పర్యటన

అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశం

​భద్రాద్రి కొత్తగూడెం, లోకల్ గైడ్ :

అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటనలు పెంచి ప్రజా సమస్యలపై తక్షణమే స్పందించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ స్పష్టం చేశారు. శనివారం ఆయన ఆళ్లపల్లి మండలంలో విస్తృతంగా పర్యటించారు. తహసీల్దార్ కార్యాలయం, ఇందిరమ్మ ఇళ్లు, విద్యాసంస్థలు, ఆరోగ్య కేంద్రం, వ్యవసాయ క్షేత్రాలను స్వయంగా పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. అనంతోగు గ్రామంలో గలిగ నాగలక్ష్మి ఇంటి నిర్మాణాన్ని తనిఖీ చేసిన కలెక్టర్, పనుల నాణ్యతపై ఆరా తీశారు. మండలంలో మంజూరైన ఇళ్లను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలన్నారు. ఆళ్లపల్లి కేజీబీవీని సందర్శించి 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక సూచనలు చేశారు. బయాలజీలో డయాగ్రామ్స్ ప్రాక్టీస్ చేయాలని కోరారు. ఇన్వర్టర్ ఏర్పాటు ద్వారా పాఠశాల విద్యుత్ సమస్యను తీరుస్తామని హామీ ఇచ్చారు. మధ్యాహ్న భోజన నాణ్యతపై నిర్లక్ష్యం వహించిన ఎంఈఓ శాంతారావుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ హెచ్చరికలు జారీ చేశారు. రైతు మద్దెల వెంకటేశ్వర్లు పామాయిల్ తోటను పరిశీలించి, మండలంలో నిర్దేశించిన 400 ఎకరాల లక్ష్యాన్ని త్వరగా చేరుకోవాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. పీహెచ్‌సీలో మందుల నిల్వలు, 108 సేవలను తనిఖీ చేశారు. ఎండాకాలం దృష్ట్యా మిషన్ భగీరథ నీటి సరఫరాలో అంతరాయం కలగకుండా చూడాలని, డెంగ్యూ, మలేరియా రాకుండా ఫాగింగ్ చేయించాలని సూచించారు.
​ఈ కార్యక్రమంలో తహసీల్దార్ జగదీష్వర్ ప్రసాద్, ఎంపీడీఓ శ్రీను, మండల ప్రత్యేక అధికారి లాల్ చంద్ తదితరులు పాల్గొన్నారు.
*ప్రభుత్వ ఆసుపత్రుల బలోపేతంపై సమీక్ష*
​జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేసి, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. శనివారం ఐడిఓసి కార్యాలయంలో ఏరియా ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, వైద్యశాఖ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ​ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు సమర్థవంతంగా అందాలని, ప్రైవేటు ఆసుపత్రులపై ఆధారపడకుండా ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు నమ్మకం కలిగించాలని సూచించారు. భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో మరుగుదొడ్ల మరమ్మత్తులతో పాటు, పెండింగ్‌లో ఉన్న భవన నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. ​జిల్లాలో సికిల్ సెల్ అనీమియా కేసులు ఎక్కువగా ఉన్న మండలాలపై ప్రత్యేక దృష్టి సారించి, పరీక్షల నిర్వహణపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ప్రైవేటు స్కానింగ్ సెంటర్లపై క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని, బ్లడ్ బ్యాంకుల్లో రక్త నిల్వలు ఎప్పుడూ అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. ​వైద్యులు సమయపాలన పాటిస్తూ, పరిశుభ్రమైన వాతావరణంలో రోగులకు సేవలు అందించాలని కలెక్టర్ కోరారు. ఈ సమావేశంలో డిసిహెచ్ఓ రవిబాబు మరియు వివిధ ఆసుపత్రుల సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

విద్యార్థుల భవిష్యత్తుకై ‘విద్యాసేవ’ – టేబుల్, కుర్చీల విరాళం విద్యార్థుల భవిష్యత్తుకై ‘విద్యాసేవ’ – టేబుల్, కుర్చీల విరాళం
    వెంకటాపురం : లోకల్ గైడ్ :ములుగు జిల్లా వెంకటాపురం మండల పరిధిలోని యాకన్నగూడెం గ్రామపంచాయతీ ఎంపీపీఎస్ పాఠశాల విద్యార్థుల కోసం ఎలకల రామారావు ఆధ్వర్యంలో టేబుల్,
ఆరోగ్య వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలి.
ఓటరు జాబితా సవరణలో రాజకీయ పార్టీల సహకారం తప్పనిసరి
రాష్ట్ర ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శి నవీన్ మిట్టల్ ను
కారేపల్లి రైల్వే భూసేకరణపై కలెక్టరేట్ లో సమావేశం 
భూ సేకరణ ప్రక్రియ ను త్వరగా పూర్తి చేయాలి.
ఆళ్లపల్లిలో జిల్లా కలెక్టర్ అంకిత్ పర్యటన