9న మాజీ మంత్రివర్యులు తన్నీరు.హరీష్ రావు పర్యటన విజయవంతం చేద్దాం.
అఖిలపక్ష పోరాట సమితిపర్యటన విజయవంతం చేయాలి అని సింగిరెడ్డి.నిరంజన్ రెడ్డి
వనపర్తి జిల్లా కేంద్రంలోని
గొల్లపల్లి చీర్కపల్లి రిజర్వాయర్ నిర్మాణ ప్రతిపాదన వ్యర్థం. ప్రజాధనాన్ని లూటీ చేయడానికి కాంగ్రెస్ నాయకుల ప్రయత్నం.
సింగిరెడ్డి.నిరంజన్ రెడ్డి
మాజీ మంత్రివర్యులు.
మాజీ మంత్రి తన్నీరు.హరీష్ రావు
ఈనెల 9న గొల్లపల్లి చీర్కపల్లి రిజర్వాయర్ నిర్మాణ ప్రతిపాదన వ్యతిరేఖ అఖిలపక్ష పోరాట సమితిపర్యటన విజయవంతం చేయాలి అని సింగిరెడ్డి.నిరంజన్ రెడ్డి పిలుపునిచ్చారు. నాయకులు చేస్తున్న దీక్షలకు సంఘీభావం తెలపడానికి వస్తున్నారని వారి
హరీష్ రావు పర్యటన కోసం ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశములో నిరంజన్ రెడ్డి రావుల.చంద్రశేఖర్ రెడ్డి తో కలసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గౌరవ నిరంజన్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పాత్ర అత్యంత కీలకమైందని ప్రజాసమస్యలను ఎప్పటికప్పుడు వెలుగులోకి తెచ్చి ప్రజలకు అండగా నిలవాలని అన్నారు.
ప్రజా ధనాన్ని లూటీ చేయడానికి కాంగ్రెస్ నాయకులు గొల్లపల్లి చీర్కపల్లి రిజర్వాయర్ ప్రతిపాదన ముందుకు తెచ్చారని దీన్ని వ్యతిరేకిస్తూ రైతులు 97రోజులుగా దీక్షలు చేస్తున్న పట్టించుకోకపోవడం రైతుల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి తెలియజేస్తుందని అన్నారు.
హరీష్ రావు పర్యటనతో రైతులకు ఖచ్చితంగా మేలు జరుగుతుందని నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలు,నాయకులు, కార్యకర్తలు వేలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు.
మరోసారీ నిరంజన్ రెడ్డి గెలుపు అభివృద్ధికి మలుపు.రావుల.చంద్రశేఖర్ రెడ్డి మాజీ ఎం.పి.
నిరంజన్ రెడ్డి ఆధ్వర్యములో హరీష్ రావు పర్యటన విజయవంతం చేద్దాం అని రావుల చంద్రశేఖరరెడ్డి పిలుపునిచ్చారు.
99రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక చేసేముందు ఆరు గ్యారంటీలు 11డిక్లరేషన్లు,420హామీల గూర్చి ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
9తారీఖు హరీష్ రావు పర్యటనను విజయవంతం చేయాలి అని విజ్ఞప్తి చేశారు.కె.సి.ఆర్ క్యాంపు కార్యాలయంపై దాడి అమానుషం.గజ్వేల్ క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ గుండాలు దాడి చేయడాని మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.
