జిల్లాలోని మున్సిపల్ పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన డిసిపి.
జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు....
మంచిర్యాల డిసిపి ఎ భాస్కర్.
మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)
మంచిర్యాల జిల్లా లోని బెల్లంపల్లి,రామక్రిష్ణ పూర్,మంచిర్యాల మున్సిపాలిటీ పరిధులలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలు,స్ట్రాంగ్ రూమ్,కౌంటింగ్ కేంద్రాలను మంచిర్యాల,బెల్లంపల్లి ఎసిపి లు ఆర్ ప్రకాష్,రవికుమార్,మంచిర్యాల పట్టణ సిఐ ప్రమోదరావు,మందమర్రి సీఐ రమేష్,శ్రీరాంపూర్ సిఐ శ్రీలత,పలువురు పోలింగ్ అధికారులతో కలిసి మంచిర్యాల డిసిపి ఎగ్గడి భాస్కర్ మంగళవారం పరిశీలించారు.ఈ సందర్భంగా డీసీపీ
ఎన్నికల పోలింగ్ కేంద్రాలను పరిశీలించి పాఠశాలలోని గదుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఏర్పాట్లను పరిశీలించి ఓటర్లు తమ ఓటు వినియోగించుకునే గదుల్లో విద్యుత్ వెలుగు స్పష్టంగా ఉండాలని,గాలి వెలుతురు స్పష్టంగా వచ్చేలా ఉండాలని,అదేవిధంగా తాగునీరు అందుబాటులో ఉంచాలన్నారు.ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛయుతమైన వాతావరణంలో వినియోగించుకోవాలని సూచించారు.పగడ్బందీగా ఏర్పాట్లు చేయాలని సూచించారు.బ్యాలెట్ బాక్సుల డిస్ట్రిబ్యూషన్‌లతో పాటు,పోలింగ్ అనంతరం స్ట్రాంగ్ రూమ్‌లో వాటి భద్రత,సీసీ కెమెరాల ఏర్పాటు,ఆర్మ్డ్ గార్డులు,సైన్ ఫ్లెక్సీలు,కౌంటింగ్ సమయంలో ఎవరికీ అనుమతి ఇవ్వాలి,తీసుకోవాల్సిన జాగ్రత్తలు,పార్కింగ్ తదితర అంశాలపై చర్చించారు.ఏర్పాట్ల విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించవద్దని,ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగేలా పోలీస్ శాఖ అప్రమత్తంగా వ్యవహరిస్తుందని డిసిపి తెలిపారు.
