12న బెల్లంపల్లిలో బాడీ బిల్డింగ్ పోటీలు....
తెలంగాణ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ సౌజన్యంతో స్కై జిమ్ ఆధ్వర్యంలో జరిగే ఈ పోటీ
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని సింగరేణి కళావేదిక ఆడిటోరియంలో ఈనెల12న 4జిల్లాల స్థాయి బాడీ బిల్డింగ్ పోటీలు జరుగుతాయని స్కై జిమ్ నిర్వాహకులు పి సదానందం తెలిపారు.తెలంగాణ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ సౌజన్యంతో స్కై జిమ్ ఆధ్వర్యంలో జరిగే ఈ పోటీలలో ఆదిలాబాద్,కరీంనగర్,ఖమ్మం,వరంగల్ జిల్లాలకు చెందిన బాడీ బిల్డర్లు పాల్గొంటారని ఆయన తెలిపారు.పట్టణంలోని క్రీడాభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.వివరాలకు 9059540130 మొబైల్ నంబర్ లలో సంప్రదించాలని ఆయన కోరారు.
జిల్లా స్థాయి క్రీడా పోటీలకు ఎంపిక.
ఈనెల13న మంచిర్యాల జిల్లా కేంద్రంలో జరిగే జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో బెల్లంపల్లికి చెందిన తమ విద్యార్థులు ఎంపికైనట్లు అథ్లెటిక్స్ అసోసియేషన్ కోచ్ సంతోష్ తెలిపారు.కె దీక్ష,యు సాయి యశ్వంత్,ఎం సహస్య,ఎండి గౌసుద్దీన్,కె సహస్ర,బి విష్ణువర్ధన్ లు ఈనెల 6న బెల్లంపల్లి జనరల్ వెల్ఫేర్ కాలేజీ క్రీడా మైదానంలో జరిగిన చీఫ్ మినిస్టర్ కప్ పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయికి ఎంపికయ్యారని ఆయన తెలిపారు.తమ అసోసియేషన్ క్రీడలకు పెద్దపీట వేస్తుందని దీనిని అందరు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
