టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెప్టెంబర్ 11న పర్యటనను విజయవంతం చేయండి
మండల కన్వీనర్ దొడ్డి తాతారావు
భద్రాద్రి కొత్తగూడెం లోకల్ గైడ్ :
సెప్టెంబర్ 11 వ తారీకున బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు (కేటీఆర్) భద్రాచలం నియోజకవర్గ పర్యటనను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం చర్ల కేంద్రంలో ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా మండల కన్వీనర్ దొడ్డి తాతారావు మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, అతి త్వరలో భద్రాచలం నియోజకవర్గం లో ఉప ఎన్నిక రాబోతున్నాయని, ఉప ఎన్నికలో మన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని, భద్రాచలంలో మళ్లీ గులాబి జెండాను ఎగురవేయాలని కార్యకర్తలను కోరారు. కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేని హమీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి ప్రజా వ్యతిరేక పరిపాలన చేస్తుందని, నిరుద్యోగులను, మహిళలను, ఉద్యోగులను, రైతులను గోరంగా మోసం చేసిందని, ఆకరికి యూరియా కూడా ఇవ్వలేని పరిస్థితిలో కాంగ్రెసు ప్రభుత్వం ఉందన్నారు. ఏమీ చేయలేని ప్రభుత్వం కాళేశ్వరం ఫోజక్ట్ పై అబద్ధాలు చెప్పి బూతద్దంలో చూపిస్తున్నారని, ప్రజలకు ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు తెలియజేలని కార్యకర్తలను కోరారు. ఈ కార్యక్రమంలో మండల కో కన్వీనర్ ఐనవోలు పవన్ కుమార్, పార్టీ సీనియర్ నాయకులు సయ్యద్ అజీజ్, గొర్ల రాజబాబు, ఏనాటి జనార్ధన్, దినసరపు భాస్కర్, రెడ్డి పంజా రాజు, డివిజన్ యూత్ నాయకులు కాకి అనిల్, ఎస్సీ సెల్ అధ్యక్షులు కుంభతిని రాము, ఎస్టీ సెల్ అధ్యక్షులు తుర్రం రవి, మహిళా ఉపాధ్యక్షురాలు కుప్పాల సౌజన్య, మహిళా కార్యదర్శి వాని, ఎస్టీ సెల్ కార్యదర్శి కోరం కన్నారావు, మండల యూత్ అధ్యక్ష కార్యదర్శులు అంబోజీ సతీష్, కుప్పాల నిరంజన్, తడికల బుల్లెబ్బాయి, సిద్ది రాజశేఖర్, బట్ట కొమరయ్య, గుమ్మల నరేంద్ర, తడికల చంద్రశేఖర్, మునిగల సాంబ, సిద్ధి సంతోష్, సిద్ది కిరణ్, తదితరులు పాల్గొన్నారు.