రోడ్డు ప్రమాదాల నివారణకు ఎన్ హెచ్ ఎ ఐ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి....
రహదారి పక్కన వాహనాలు నిలుపకుండా చూడాలి...
By Ram Reddy
On
బెల్లంపల్లి ఎసిపి కిరణ్ కుమార్...
మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)
రోడ్డు ప్రమాదాల నివారణకు ఎన్ హెచ్ ఎ ఐ అప్రమత్తంగా ఉండాలని,అదేవిధంగా రహదారి పక్కన వాహనాలు నిలుపకుండా ఎప్పటికప్పుడు జాతీయ రహదారి అధికారులు చర్యలు తీసుకోవాలని బెల్లంపల్లి ఎసిపి కిరణ్ కుమార్ పేర్కొన్నారు.రహదారి భద్రతే లక్ష్యంగా చేపట్టిన అరైవ్ అలైవ్ ప్రచార కార్యక్రమంలో భాగంగా బుధవారం మందమర్రిలో ఎన్ హెచ్ఏఐ పెట్రోలింగ్ బృందాలతో బెల్లంపల్లి ఎసిపి బుధవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎసిపి మాట్లాడుతు జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణలో పెట్రోలింగ్ పార్టీల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు.విధి నిర్వహణలో సిబ్బందికి ఉండాల్సిన బాధ్యతలు,క్షేత్రస్థాయిలో వారు అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు.ప్రమాదాలు జరిగిన వెంటనే స్పందించడం,క్షతగాత్రులను సకాలంలో ఆసుపత్రికి తరలించడం వంటి అంశాలపై సిబ్బందికి స్పష్టమైన అవగాహన ఉండాలని సూచించారు.ప్రమాదాల నివారణకై రహదారిపై నిలిచిపోయిన వాహనాల వల్ల ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.రాత్రి సమయాల్లో పెట్రోలింగ్ మరింత ముమ్మరం చేయాలని,వేగ పరిమితిని మించిన వాహనదారులను గుర్తించి హెచ్చరించాలని ఆదేశించారు.ప్రయాణికుల ప్రాణాలను కాపాడటమే ప్రథమ కర్తవ్యంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మందమర్ర సిఐ పర్స రమేష్,ఎస్సైలు గోపతి నరేష్,ఎస్సై అంజనేయులు,జాతీయ రహదారి అధికారులు,సిబ్బంది,సంబంధిత విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Latest News
06 Apr 2026 20:55:56
చర్ల : లోకల్ గైడ్ :భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లం పరిధిలో ఉన్న ఆర్ కొత్తగూడెం గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు సర్పంచ్ తుర్రం రవికుమార్,...
