క్షయ రహిత జిల్లా కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి.

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి  డాక్టర్ పుట్ల శ్రీనివాస్ ,

  నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి మార్చి 24 (లోకల్ గైడ్)


ప్రపంచ క్షయ దినం మార్చ్ 24 సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చందం పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరై న డాక్టర్ పుట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ క్షయ రహిత జిల్లా కోసం ప్రజలు భాగస్వామ్యం తో ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆయన కోరారు ఈసందర్భంగా టీబీ ముక్త్ భారత్ అభియాన్ రెండవ దశ వందరోజుల కార్యక్రమం ను అయన ప్రారంభించాడు జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఉచిత మొబైల్ ఏ ఐ చెస్ట్ ఎక్స్ రే స్క్రీనింగ్ క్యాంప్స్ ను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు .ఈ కార్యక్రమంలో డిప్యూటీ డి ఎం హెచ్ ఓ లు డాక్టర్ రాహుల్, డాక్టర్ దీప వివిధ ప్రోగ్రామ్ ఆఫీసర్లు డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి, డాక్టర్ కృష్ణకుమారి డాక్టర్  రవి ప్రసాద్ చందం పేట సర్పంచ్ మహ్మద్ సాదిక్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారి డాక్టర్ రాజేష్ , జిల్లా క్షయ నివారణ కార్యక్రమం సిబ్బంది ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది ఆశ వర్కర్లు పాల్గొన్నారు.జిల్లా లో క్షయ నిర్మూలన కార్యక్రమం లో ఉత్తమ సేవలు అందించిన సిబ్బందికి అవార్డు లు, ప్రశంస పత్రాలు అందించారు.

Tags:

About The Author

Latest News