అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు- సేవాలాల్ సేన రాష్ట్ర ప్రచార కార్యదర్శి భూక్య రవి నాయక్
లోకల్ గైడ్ ప్రతినిధి బయ్యారం
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కేద్రoలో సేవాలాల్ సేన లంబాడీల ఐక్యవేదిక లంబాడి హక్కుల పోరాట సమితి అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించు ధర్నాకి ముందస్తుగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.మా గిరిజనులకి ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయాలని *సేవాలాల్ మహారాజ్ గుడిని హైదరాబాద్ లోనే నిర్మించాలని తలపెట్టిన ధర్నాను అడ్డుకోవడం సమంజసం కాదు* కనీసం మా గోడును తెలుపుకునే హక్కు మాకు లేదా అక్రమ అరెస్టులతో మా ఉద్యమాన్ని ఆపలేరు..అర్ధరాత్రి నక్సలైట్ల మాదిరి అరెస్టులు చేయడం ప్రజాస్వామ్యం కాదు? అరెస్టు అయిన వారిలో లంబాడీల ఐక్య వేదిక బయ్యారం మండల అధ్యక్షులు జరుపుల శ్రీను నాయక్ సేవాలాల్ సేన జిల్లా నాయకులు తేజావత్ రవీందర్ నాయక్ లంబాడి హక్కుల పోరాట సమితి మండల అధ్యక్షుడు బాదావత్ నరేష్ నాయక్ లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా నాయకులు ఇస్లావత్ అభిరాం నాయక్ లు ఉన్నారు వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు...
