ప్రకృతి వ్యవసాయ కిట్ల పంపిణీ – రైతులకు అవగాహన కల్పించిన అధికారులు
రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లాల్సిన అవసరం ఉందని అధికారులు
By Ram Reddy
On
సిద్దిపేట జిల్లా ప్రతినిధి(లోకల్ గైడ్ తెలంగాణ)
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏవో సంతోష్ మాట్లాడుతూ,కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్’ ద్వారా రైతులకు అనేక ప్రయోజనాలు లభిస్తున్నాయని తెలిపారు. రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని తగ్గించి, ప్రకృతి సిద్ధమైన పద్ధతులను అవలంబించాలని సూచించారు.
ఆవు పేడ, ఆవు మూత్రంతో తయారు చేసే జీవామృతం, బీజామృతం వంటి సేంద్రియ ఎరువులు నేల సారాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. వీటి వినియోగం ద్వారా పంటల దిగుబడి మెరుగుపడటమే కాకుండా, రైతుల పెట్టుబడి వ్యయం కూడా తగ్గుతుందని వివరించారు.అలాగే, ప్రకృతి వ్యవసాయం ద్వారా పండే పంటలు పూర్తిగా విషరహితంగా ఉండి, ప్రజల ఆరోగ్యానికి మేలు చేస్తాయని పేర్కొన్నారు. రైతులు సంప్రదాయ రసాయన సాగును విడిచిపెట్టి, ప్రకృతి సేద్యం వైపు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సిబ్బంది సర్పంచులు ఏలా విజయ,D సురేష్, P రమేష్ మాజి సర్పంచ్ P వెంకట్ రెడ్డి వార్డ్ మెంబర్ రాజు మహేందర్ మరియు రైతులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Latest News
30 Mar 2026 21:08:53
ఆస్థి పన్ను వసూల్ కోసం ఇళ్లకు వెళ్లిన అధికారులకు సవా లక్షా ప్రశ్నలతో ముచ్చెమటలు పట్టిస్తున్న ఆస్తిపన్నుదారులు. కాలనీలో ఏం అభివృద్ధి చేశారని ఆస్తిపన్ను వసూలుకు
