గ్రామపంచాయతీ కార్మికుల ఉద్యమంపై నిర్బంధాన్ని ఖండించండి. 

బడ్జెట్ సమావేశాల లోనే గ్రామపంచాయతీ కార్మికుల వేతనాలు పెంచాలి. 

గ్రామపంచాయతీ కార్మికుల ఉద్యమంపై నిర్బంధాన్ని ఖండించండి. 

యూనియన్ జిల్లా కార్యదర్శి చినపాక లక్ష్మీనారాయణ.

 

 

 


నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి. మార్చి 17. (లోకల్ గైడ్)

              గ్రామపంచాయతీ కార్మికులకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందర ఇచ్చిన వేతనాల పెంపు హామీని అమలు చేయాలని, గ్రీన్ ఛానల్ ద్వారానే వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శాంతియుతంగా చలో హైదరాబాద్ వెళ్లిన కార్మికులను అరెస్టులు చేసి ఎక్కడికి ఎక్కడ నిర్బంధించడానికి తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) జిల్లా కార్యదర్శి చిన్న పాక లక్ష్మీనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు.
            మంగళవారం యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చలో హైదరాబాద్ కు శాంతియుతంగా ధర్నా చేయడానికి వెళుతున్న కార్మికులను తెల్లవారుజాము నుంచి అరెస్టు చేసి హైదరాబాదులో ధర్నా చేయకుండా ఎక్కడికక్కడ అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్ లో నిర్భందించడానికి ప్రజలు ప్రజాస్వామికవాదులు ఖండించాలని కోరారు. ఇందిరామరాజ్యం ప్రజా పాలన పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయమంటే అరెస్టులు చేయడం ఏంటని ప్రశ్నించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయని అందులో కార్మికులకు వేతనాల పెంపు కోసం బడ్జెట్ కేటాయించి గ్రీన్ ఛానల్ ద్వారానే వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. 
            కార్మికుల మెడ పై ఉరితాడు లాంటి మల్టీపర్పస్ విధానం రద్దు చేస్తామని ఆనాడు పోరాడుతుంటే మద్దతు ఇచ్చారని తము అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడిచిన అమలు చేయకపోగా ఉద్యమాలపై నిర్బంధాన్ని ప్రయోగించడం న్యాయం కాదని అన్నారు. అర్హత కలిగిన వారిని చేయాలని కనీస వేతనం 26 వేలు పెంచాలని ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనియెడల ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 
             ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ అయిన యాదాద్రి భువనగిరి, నల్లగొండ, జనగాం జిల్లా నాయకులు పొన్న అంజయ్య, ఇ ఎల్లేష, స్వామి, జ్ఞానేశ్వర్, ఏడుకొండలు, భాస్కర్, రమేష్, కవిత, అండాలు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

ఎంతరాత్రి వరకైనా సరే ఆస్తి పన్ను వసూలు చేయాల్సిందే - షాద్ నగర్ మున్సిపాల్ కమిషనర్ అధికారులకు హుకుంజారీ. ఎంతరాత్రి వరకైనా సరే ఆస్తి పన్ను వసూలు చేయాల్సిందే - షాద్ నగర్ మున్సిపాల్ కమిషనర్ అధికారులకు హుకుంజారీ.
  ఆస్థి పన్ను వసూల్ కోసం ఇళ్లకు వెళ్లిన అధికారులకు సవా లక్షా ప్రశ్నలతో ముచ్చెమటలు పట్టిస్తున్న ఆస్తిపన్నుదారులు. కాలనీలో ఏం అభివృద్ధి చేశారని ఆస్తిపన్ను వసూలుకు
గాలి గూడెంలో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశo
కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి.
బిజ్వార్ లో సీసీ రోడ్డు పనులు ప్రారంభం 
ఛత్రపతి శివాజీ,అంబేద్కర్ విగ్రహావిష్కరణ భూమి పూజలో
హైదరాబాద్‌లో ఘనంగా ‘యువ భారత్ రన్ 2026’ నిర్వహణ – యువతలో ఫిట్‌నెస్, విలువలకు నూతన దిశ
శాసనసభలో ఆర్‌&బీ శాఖపై మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ప్రసంగం