ఆరు గ్యారెంటీలు వెంటనే అమలు చేయాలి:బిజెపి
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు అనేక హామీలు ఇవ్వడం
నారాయణపేట మార్చి 16:
రాష్ట్ర ప్రభుత్వం హామీలను తక్షణమే అమలు చేయాల ని డిమాండ్ చేస్తు సోమవా రం బీజేపీ పట్టణ అధ్యక్షులు పోషల్ వినోద్ ఆధ్వర్యంలో మున్సిపల్ ఇంజనీర్ కి సమర్పించారు.రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు అనేక హామీలు ఇవ్వడం జరిగింది. కానీ వాటిలో ఏ ఒక్క హామీ కూడా ఇప్పటివరకు పూర్తిగా అమలు కాలేదు. ముఖ్యంగా యువతకు జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి, వృద్ధాప్య, వితంతు, దివ్యాంగులకు పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, పేదలకు గృహ నిర్మాణ పథకం, రైతులకు రైతు భరోసా, భూ సమస్యల పరిష్కారం వంటి అనేక హామీలు ఇప్పటికీ అమలు కావడం లేదు. ప్రభుత్వం మీద నమ్మకం పెట్టుకొని ఓటు వేసిన ప్రజలు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా సమయానికి అందకపోవడం తో రైతులు పెట్టుబడుల కోసం అప్పులపై ఆధారప డాల్సిన పరిస్థితి ఏర్పడుతోందన్నారు.
అలాగే వృద్ధాప్య, వితంతు మరియు దివ్యాంగులకు ప్రభుత్వం అందించే ఆసరా పెన్షన్లు అర్హులైన లబ్ధిదారులకు అందడంలేదు. మండలంలో దరఖాస్తులు చేసుకున్న అనేక మంది వృద్ధులు, వికలాంగులు మరియు ఒంటరి మహిళలకు ఇప్పటికీ పెన్షన్లు మంజూరు కాలేదు. అర్హులైన అభ్యర్థులందరి దరఖాస్తులను వెంటనే ఆమోదించి వారికి పెన్షన్లు అందించాలని కోరారు.
పేదలకు ప్రభుత్వం ప్రకటిం చిన గృహ నిర్మాణ పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు వెంటనే ఇళ్లు మంజూరు చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సుల్లో ప్రజలు దరఖాస్తులు సమర్పించి నప్పటికీ వారి సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదన్నారు. ఆ దరఖాస్తుల ను తక్షణమే పరిష్కరించి ప్రజలకు న్యాయం చేయాల ని కోరారు.ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు మిర్చి వెంకటయ్య, టౌన్ బిల్డర్ వెంకటరాములు, శ్యాంసుందర్ గౌడ్ ,ఆశప్ప, రఘురామయ్య గౌడ్,గోపాల్ యాదవ్,డీలర్ అశోక్,సైదప్ప నక్క సత్యనారాయణ,దత్తు జాజాపూర్ మణిశంకర్ మరియు పట్టణ కమిటీ అలాగే వివిధ మోర్చాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
ఫోటో రైట్ అప్:1.వినతి పత్రం ఇస్తున్న బిజెపి నాయకులు
_____________________
