వట్టిపోయిన కృష్ణమ్మ... "చి వరి"కి ఉరి

లిఫ్టుల ద్వారా నీరందక రైతుల ఆందోళన , బీటలు వారుతున్న వరి పొలాలు

వట్టిపోయిన కృష్ణమ్మ...

ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతుల మొర

IMG-20260315-WA0133నారాయణపేట మార్చి 16:

కృష్ణా నది తీరంలో ఉన్న రైతులు  కృష్ణ నది వట్టి పోవడంతో వరి సాగు చేసిన రైతులు ఆందోళన చెందుతున్నారు.లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా చివరి ఆయకట్టుకు సాగు నీరు అందే అవకాశం లేదని ఇప్పటికే చివరి ఆయకట్టులో సాగు చేసిన వరి పంటలు బీటలు వారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రధానంగా కృష్ణ నది తీరంలోని ముడుమాల్ ఏ , బి ఎత్తిపోతల పథకాల కింద ముడుమాల్ పుంజనూర్ కోల్పూర్ అడివి  సత్యవర్, మందిపాల్, గజరం దొడ్డి గ్రామాలకు సాగునీరు అందుతుంది. ప్రస్తుతం కృష్ణానది వట్టి పోవడంతో చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదు ర్కొంటున్నారు.నెల రోజులు గడిస్తే పంటలు చేతికొస్తాయ నీ రైతులు తెలిపారు.ఈ లిఫ్టుల కింద సుమారు 2వేల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు.ప్రస్తుతం వరి పంట పొట్ట పోసుకుంటున్నది.మరో నెల రోజులు సాగునీరు అందితే పంట పండి బయట పడతామని రైతులు చెబుతున్నారు.కానీ కృష్ణ నదిలో నీరు వట్టిపోవడంతో లిఫ్ట్ లకు నీరు అందడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు.కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందని తెలంగాణలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని రాష్ట్ర ప్రభుత్వం కర్ణాటక రాష్ట్రంతో మాట్లాడి నీటిని విడుదల చేయించి తెలంగాణ రైతుల ఇబ్బందులు తీర్చాలని రైతులు కోరుతున్నారు.నీటి విడుదల కాకపోతే వేల ఎకరాల్లో వరి దెబ్బతిని పంట చేతికి అందక అప్పుల పాలై ఉరి వేసుకోవాల్సిందేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు.రాష్ట్ర ప్రభుత్వం పంటను కాపాడే చర్యలు తీసుకోవా లని కోరుతున్నారు.

* 30 ఎకరాలు కౌలుకు తీసుకున్నా
లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఉండడంతో మాగనూర్ మండలం కోల్పూర్ రైతునర్సింలుగౌడ్ 30 ఎకరాలు లీజుకు తీసుకుని వరి పంట సాగు చేశానని తెలిపారు.ప్రస్తుతం పంట పొట్ట దశలో ఉందని త్వరలో వెన్నెళ్లుతుందని అన్నారు. అయితే కృష్ణ నదిలో నీరు లేక సాగు నీరు అందక పోతే మొత్తం నాశనం అవుతుంద న్నారు.

* మంత్రి దృష్టికి తీసుకొ చ్చాం
కృష్ణ తీరంలోని లిఫ్ట్ ఇరిగేషన్ కింద రైతులు పడుతున్న ఇబ్బందులను రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి దృష్టికి తీసుకెళ్లామని మార్కెట్ కమిటీ డైరెక్టర్ శంకర్ లింగం తెలిపారు.మంత్రి సానుకూలంగా స్పందించారని కర్ణాటక ప్రభుత్వం సంబంధిత అధికారులతో మాట్లాడి నీటిని విడుదల చేయించి పంటలు కాపాడుతామని హామీ ఇచ్చారని తెలిపారు.
ఫోటో రైట్ అప్:2.వట్టిపోయిన కృష్ణమ్మ,3.ముడుమాల్ లిఫ్ట్,4..నీరు అందక బీటలు వారుతున్న వరి,5.రైతు నర్సింలు గౌడ్
_______________________

Tags:

About The Author

Latest News

హైదరాబాద్ మెట్రో వేళల మార్పుపై కేంద్రానికి వినతి. హైదరాబాద్ మెట్రో వేళల మార్పుపై కేంద్రానికి వినతి.
లోకల్ గైడ్  హైదరాబాద్హైదరాబాద్ జంట నగరాల్లో ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రో రైలు వేళలను ముందుకు జరపాలని కేంద్ర ప్రభుత్వానికి వినతి వెళ్లింది. అంతర్జాతీయ ఇంధన సంక్షోభం నేపథ్యంలో...
ఖేలో ఇండియా వేదికగా తెలంగాణకు కీర్తి తేవాలని మౌనిక లక్ష్యం
ఎన్ఎస్ఎస్ శిబిరంలో కంటి వైద్య పరీక్షలు...
లోక్ అదాలత్ లో 740 కేసులు పరిష్కారం. 
త్రివేణిలో ఘనంగా ‘ఎర్త్ అవర్’ అవగాహన కార్యక్రమాలు  
అభివృద్ధి దిశగా సింగరేణి గ్రామం
హనుమకొండ రమేష్ దంపతులకు ఘన సన్మానం