ఓటు హక్కును వినియోగించుకోవడం పౌరులందరి బాధ్యత.

ఆదివారం ఉదయం ఐడిఓసి ఆవరణలో ఓటరు దినోత్సవ ర్యాలీని అదనపు కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు.

ఓటు హక్కును వినియోగించుకోవడం పౌరులందరి బాధ్యత.

గద్వాల, లోకల్ గైడ్ :
ప్రజాస్వామ్య దేశంలో 18 సంవత్సరాలు నిండితే ఓటరుగా నమోదు కాబడి, ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవడం పౌరులందరి బాధ్యత అని అదనపు కలెక్టర్ నర్సింగరావు అన్నారు. 16వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం ఉదయం ఐడిఓసి ఆవరణలో ఓటరు దినోత్సవ ర్యాలీని అదనపు కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. పౌరులు, వివిధ శాఖల అధికారులతో పాటు పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఓటు ప్రాధాన్యతను తెలియజేసే ప్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు.  కలెక్టరేట్ నుంచి రైల్వే పైవంతెన మీదుగా అంబేద్కర్ చౌరస్తా, కృష్ణవేణి చౌరస్తా వరకు ర్యాలీ జరిగింది. ఈ సందర్బంగా 1950 జనవరి 26న గణతంత్ర దేశంగా ఆవిర్భవించిన తర్వాత ప్రజలు తమకు నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి పౌరులందరికీ ఓటు హక్కును కల్పించడం జరిగిందన్నారు. విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలు కలిగిన, వివిధ వర్గాల ప్రజలతో వైవిద్య భరితంగా ఉన్న మన దేశంలో దశాబ్దాలుగా ప్రజాస్వామ్య మనుగడకు ఓటు హక్కు కీలకంగా నిలుస్తోందన్నారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్రంలోనే మన జిల్లా అత్యధిక ఓటింగ్ శాతంతో టాప్ 5 లో నిలిచిందన్నారు. ఇదే స్ఫూర్తితో మున్సిపల్ ఎన్నికల్లోను ప్రతి ఓటరు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా అదనపు కలెక్టర్  పిలుపు నిచ్చారు. అనంతరం అధికారులు ర్యాలీలో పాల్గొన్న వారందరితో ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో స్వీప్ నోడల్ అధికారి రమేష్ బాబు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ నుషిత, బీసీ సంక్షేమ శాఖ అధికారి అక్బర్ పాషా, డివైఎస్ఓ కృష్ణయ్య, గద్వాల తహసిల్దార్ మల్లికార్జున్, ఇతర అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

తమ్ముడు అంటే ఇలా ఉండాలి. తమ్ముడు అంటే ఇలా ఉండాలి.
లోకల్ గైడ్ : షాద్‌నగర్ అన్నపై ఉన్న ప్రేమకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచాడు గుర్రపల్లి భాను యాదవ్. తన అన్న లల్లు యాదవ్ పుట్టినరోజు సందర్భంగా భాను...
టీజేఎంయూ ఖమ్మం జిల్లా అధ్యక్షులుగా ఎండీ ఫస్సిద్దిన్ ఏకగ్రీవ ఎంపిక 
షాద్ నగర్ పట్టణాభివృద్ధికి కాంగ్రెస్ కు ఓటు వేయండి.
కాంగ్రెస్ పార్టీ మాత్రమే అభివృద్ధిని అందించగలదు.
అభివృద్ధి, ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం-కాంగ్రెస్ పార్టీ జిల్లేడు చౌదరి గూడెం మండల అధ్యక్షులు చలివేంద్రం పల్లి రాజు. 
మరో గంటలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల.
మంత్రి పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన గణపారపు వీరయ్య