మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం.
నాగులపల్లి గ్రామ సర్పంచ్ నాగిరెడ్డి.
డ్వాక్రా భవన నిర్మాణం కోసం భూమి పూజ.
లోకల్ గైడ్/ తాండూర్:
మహిళలను ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, విద్యాపరంగా ముందుకు తీసుకెళ్లడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన ధ్యేయం అని నాగులపల్లి గ్రామ సర్పంచ్ నాగిరెడ్డి తెలిపారు. ఆదివారం రూ.10 లక్షల ఎంజిఎన్ఆర్ఇజిఎస్ నిధులతో నిర్మించనున్న మహిళా సమైక్య భవనం కోసం స్థానిక నాయకులతో కలిసి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ నాగిరెడ్డి మాట్లాడుతూ... ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాలలో దశలవారీగా అభివృద్ధి చేసుకుందామని సూచించారు.ఇందుకు ప్రతి ఒక్కరి సహకారం అవసరమని తెలిపారు. పార్టీలకతీతంగా గ్రామ అభివృద్దే ప్రధాన ఏజెండాగా ముందుకెళ్దామని గ్రామస్తులను కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు శేఖర్, ఉప సర్పంచ్ శ్రీనివాస్, వార్డు సభ్యులు ఏం రమేష్, హెచ్. అశోక్, గ్రామస్తులు వీరారెడ్డి, హన్మంతు, అశోక్ గౌడ్, శ్రీనివాస్, మంగలి బసవరాజ్, యాదప్ప తదితరులు పాల్గొన్నారు.
