మహిళా సంఘాలకు ఎలక్ట్రిక్ బస్సులు.
తొలి దశంలో 40-50
లోకల్ గైడ్ హైదరాబాద్ :
డిప్యూటీ మేయర్ మెతె శ్రీలతారెడ్డిలతో కలిసి జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో జోనల్, డిప్యూటీ కమిషనర్లు, ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. హెచ్-సిటీ, ఎస్‌ఎన్‌డీపీ, ఎస్‌ఆర్‌డీపీ తదితర ప్రాజెక్టులతోపాటు వివిధ విభాగాల అధికారులు నగరంలో జరుగుతోన్న అభివృద్ధి పనులు, ఇతర అంశాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. నగరంలో ప్రస్తుతం 72,942 స్వయం సహాయక సంఘాలున్నాయని, వీటి సంఖ్య లక్షకు పెంచేలా..
ప్రతి పేద మహిళ సంఘంలో చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఐదేళ్లపాటు పాలకమండలికి సహకరించిన అధికారులు, ప్రజలకు ఈ సందర్భంగా విజయలక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు. స్వచ్ఛతలో హైదరాబాద్‌ను దేశంలోనే అగ్రభాగాన నిలిపేందుకు పారిశుధ్య పర్యవేక్షణ బాధ్యతలు ఇంజనీర్లకు అప్పగించామని కమిషనర్ కర్ణన్ చెప్పారు. ఈ సందర్భంగా 22మందికి కారుణ్య నియామక పత్రాలు అందజేశారు..
