బీసీ రిజర్వేషన్ అడ్డుకునే పార్టీలపై యుద్ధభేరి మోగిస్తాం

రజక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బీసీ రత్న అవార్డు గ్రహీత ముప్పు బిక్షపతి

బీసీ రిజర్వేషన్ అడ్డుకునే పార్టీలపై యుద్ధభేరి మోగిస్తాం

 లోకల్ గైడ్  హైదరాబాద్ : 

 హైదరాబాద్ : స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రాజకీయ రిజర్వేషన్లు అడ్డుకుంటున్న పార్టీలను రాజకీయ సమాధి చేయాలని రజక సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బీసీ రత్న అవార్డు గ్రహీత ముప్పు బిక్షపతి అన్నారు  
 ఆదివారం నాడు  బీసీ ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొని ప్రసంగిస్తూ.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో 42% బీసీలకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని బిల్లు ఆమోదించి కేంద్రానికి పంపితే కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం అడ్డుకుంటుందని ఇట్టి విషయాన్ని బీసీ లందరూ గమనంలో ఉంచుకొని రాబోయే రోజుల్లో జరగనున్న అన్ని ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పేందుకు బీసీలు సిద్ధం కావాలని, అలాగే బిఆర్ఎస్ పార్టీ కూడా బీసీల పట్ల దొంగ నాటకాలు ఆడుతున్నారని అధికారంలో ఉన్నంతసేపు బీసీలకు చేయాల్సిన ద్రోహం చేసి ఇప్పుడు బీసీల పట్ల అవాజ్యమైన ప్రేమ కురిపిస్తున్నారని ఇదంతా బీసీలు గమనిస్తూనే ఉన్నారని అధికారంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాల పాటు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ జ్యోతిరావు పూలే జయంతి మరియు వర్ధంతి సందర్భంగా ఆయనచిత్రపటానికి కనీసం పూలమాల కూడా వేయలేదని అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహాలు ఏర్పాటు చేయలేకపోయారని, బి సి ఎమ్మెల్యేలకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వని దుర్మార్గమైన దొర కేసీఆర్ అని అలాంటి వారు ఇప్పుడు బీసీల పట్ల వల్లమాలిన ప్రేమ కురిపించటం వెనక ఆంతర్యం ఏమిటో అందరికీ తెలుసునని ఆయన అన్నారు 
 ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం బీసీ బిల్లు కొరకు ఆర్డినెన్స్ జారీ చేసిందని రాష్ట్ర గవర్నర్ తక్షణమే ఆర్డినెన్స్ కు ఆమోదం తెలపాలని అందుకు రాష్ట్రంలోని అన్ని బీసీ సంఘాలు ఐక్యంగా నిలబడి రిజర్వేషన్ సాధించేవరకు అన్ని పార్టీలపై యుద్ధభేరి మోగిస్తామని అన్నారు
 సమావేశంలో బీసీ నాయకులు నేషనల్ మనం ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ చక్రవర్తి, అమృత రావు, సురేందర్, రాణి, కల్పన, తదితరులు పాల్గొన్నారు

Tags:

About The Author

Latest News

మండలంలో మంత్రి పొంగులేటి విస్తృత పర్యటన.. మండలంలో మంత్రి పొంగులేటి విస్తృత పర్యటన..
లోకల్ గైడ్ :          టేకులపల్లి మండలం లో ఎమ్మెల్యే కోరం కనకయ్యతో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోమవారం విస్తృతంగా పర్యటించారు. ఆయనకు కాంగ్రెస్ పార్టీ...
ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో వృద్ధురాలి మృతి
యురియ కోసం రైతులు పడిగాపులు BRS  ధర్నా
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని 17వ వార్డు బీసీ కాలనీలో
రోడ్డు మధ్యలో ప్రమాదకరమైన విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్
బీసీ రిజర్వేషన్ అడ్డుకునే పార్టీలపై యుద్ధభేరి మోగిస్తాం
#Draft: Add Your Title