తొర్రూరులో ఏఐఎస్ఎఫ్ 90వ ఆవిర్భవ దినోత్సవ వేడుకలు  ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సభ్యులు బందు మహేందర్

అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ 90వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను

తొర్రూరులో ఏఐఎస్ఎఫ్ 90వ ఆవిర్భవ దినోత్సవ వేడుకలు  ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సభ్యులు బందు మహేందర్


తొర్రూరు లోకల్ గైడ్ : 
 అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ 90వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను తొర్రూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో  ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సభ్యులు బందు మహేందర్ ముఖ్యఅతిథిగా హాజరై  శ్వేత-అరుణ పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ భారతదేశంలోనే మొట్టమొదటి విద్యార్థి సంఘమని,స్వాతంత్రం రాకపూర్వమే 1936 ఆగస్టు 12న  ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని, లక్నో నగరంలోని బెనారస్ యూనివర్సిటీలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య పురుడోసుకున్నదాని,కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు దేశంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘం ఏదైనా ఉన్నదంటే అది ఒక్క ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘమే అని, నాటి నుంచి నేటి వరకు విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం, ప్రభుత్వ పాఠశాలలలో కళాశాలలలో మౌలిక సదుపాయాల కల్పించాలని, పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ,ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని, మెస్ ,కాస్మోటిక్ చార్జీలను ధరలకు అనుగుణంగా పెంచాలని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని, విద్యాశాఖ మంత్రిని వెంటనే కేటాయించాలని, గురుకుల విద్యార్థులకు సొంత భవనాలను కేటాయించాలని అనేక సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు, ఉద్యమాలు చేస్తున్న ఏకైక సంఘం ఏఐఎస్ఎఫ్ అని ఆయన అన్నారు. విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఇచ్చే పిలుపులకు విద్యార్థి లోకం ఏఐఎస్ఎఫ్ ఇచ్చే పిలుపులను  విజయవంతం చేయాలని, విద్యార్థులకు  అండ, ఏఐఎస్ఎఫ్ జెండా ఎల్లప్పుడూ ఉంటదని ఆయన అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో  మండల నాయకులు కిన్నెర సాయల్ , పస్తం సాయి కిరణ్ రాహుల్ ప్రణీత్,  సాయి అనుప్,  అభినయ్ , యకయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News