మానవ సమాజ వికాసానికి విలువైన వనరు విద్య.

సోషలిస్టు సమాజం ద్వారానే విద్య సామాజికీకరణ

మానవ సమాజ వికాసానికి విలువైన వనరు విద్య.

పి.డి.ఎస్.యు. తెలంగాణ రాష్ట్ర 23వ మహాసభలో ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కొండా నాగేశ్వరరావు.

ఖమ్మం:లోకల్ గైడ్:
దేశంలో కుల,మత, ఆర్థిక తారతమ్య భేదాలు లేకుండా మానవ సమాజ వికాసానికి విలువైన వనరుగా విద్య ఉపయోగపడాలని, అలాంటి విద్య సోషలిస్టు సమాజం ద్వారా మాత్రమే సాధ్యమని ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కొండా నాగేశ్వరరావు అన్నారు.

ఆదివారం ఖమ్మం జిల్లా కేంద్రంలోని రామ నర్సయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పి.డి.ఎస్.యు) తెలంగాణ రాష్ట్ర 23వ మహాసభలు మూడవరోజు కొనసాగాయి. 
ఈ సందర్భంగా జరిగిన విద్య గోష్టి లో "విద్యారంగం సంక్షోభం"అనే అంశాన్ని ఓయూ ప్రొఫెసర్ కొండా నాగేశ్వరరావు, జాతీయ అంతర్జాతీయ పరిస్థితులు-విద్యార్థుల కర్తవ్యాలు" అనే అంశాన్ని సామాజిక వేత్త డి.పాపారావు లు బోధించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు విద్యా ద్వారా ప్రశ్నించే తత్వాన్ని, మానవీయ నైతిక విలువలు పెంపొందించుకోవాలని అన్నారు. విద్యార్థుల విజ్ఞానం సమాజ అవసరాలు నెరవేర్చేదిగా ఉండాలని కోరారు. విద్య రంగంలో ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల ఫలితంగా సమాజంలో సామాజిక ,ఆర్థిక, అసమానతలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని అన్నారు. సమాజం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి  దృక్పథం కలిగి ఉండాలని విద్యార్థి, యువతకు పిలుపునిచ్చారు. 
పాపారావు మాట్లాడుతూ సామ్రాజ్యవాద వ్యతిరేకతను కలిగి ఉండటమే నిజమైన దేశభక్తి అని తెలిపారు. 
దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశ సార్వభౌమత్వాన్ని అమెరికా కు తాకట్టు పెట్టిందని తీవ్రంగా ఆక్షేపించారు. దేరంగా సమస్యలు మొదలుకొని సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాలను ఉదృతం చేయాల్సిన తరుణం ఆసన్నమైందని అన్నారు. 

అనంతరం పి.డి.ఎస్.యు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.అనిల్ కార్యదర్శి నివేదికను ప్రవేశపెట్టారు. "ప్రణాళిక -నిబంధనవళి" రాష్ట్ర ఉపాధ్యక్షులు 
బి.నరసింహరావు ప్రవేశపెట్టగా మహాసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. 

ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్.యు. రాష్ట్ర అధ్యక్షులు కాంపాటి పృథ్వి, ఉపాధ్యక్షులు  ఎర్ర అఖిల్ కుమార్, 
ఎం.నరేందర్, ఎస్. రాకేష్, సహాయ కార్యదర్శులు ఎం.సాయి, కర్క గణేష్, 
జి.సురేష్, వి.వెంకటేష్, రాష్ట్ర నాయకులు బి.అజయ్, అలవాల నరేష్, ట.లక్ష్మణ్, ఎల్. అనిల్, అంగిడి కుమార్, మునిగేల శివప్రసాద్, అషూర్, వి. కావ్య, దీక్షిత, గుమ్మడి చైతన్య,పి.అనూష, సీతారాం, మధు, అశోక్ తదితరులు పాల్గొన్నారు. 
విప్లవాభినందనాలతో..
టి. లక్ష్మణ్, వి.వెంకటేష్
జిల్లా అధ్యక్షా, ప్రధాన కార్యదర్శులు.ఖమ్మం.

Tags:

About The Author

Latest News

తమ్ముడు అంటే ఇలా ఉండాలి. తమ్ముడు అంటే ఇలా ఉండాలి.
లోకల్ గైడ్ : షాద్‌నగర్ అన్నపై ఉన్న ప్రేమకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచాడు గుర్రపల్లి భాను యాదవ్. తన అన్న లల్లు యాదవ్ పుట్టినరోజు సందర్భంగా భాను...
టీజేఎంయూ ఖమ్మం జిల్లా అధ్యక్షులుగా ఎండీ ఫస్సిద్దిన్ ఏకగ్రీవ ఎంపిక 
షాద్ నగర్ పట్టణాభివృద్ధికి కాంగ్రెస్ కు ఓటు వేయండి.
కాంగ్రెస్ పార్టీ మాత్రమే అభివృద్ధిని అందించగలదు.
అభివృద్ధి, ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం-కాంగ్రెస్ పార్టీ జిల్లేడు చౌదరి గూడెం మండల అధ్యక్షులు చలివేంద్రం పల్లి రాజు. 
మరో గంటలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల.
మంత్రి పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన గణపారపు వీరయ్య