ప్రిన్సిపాల్ పొక్కుల  సదానందం ఆధ్వర్యంలో ఘనంగా స్పోర్ట్స్ అండ్ కల్చరల్  సెలబ్రేషన్స్..

అనవసర ప్రేమలు వద్దు తల్లిదండ్రులను మాత్రమే ప్రేమించండి..

ప్రిన్సిపాల్ పొక్కుల  సదానందం ఆధ్వర్యంలో ఘనంగా స్పోర్ట్స్ అండ్ కల్చరల్  సెలబ్రేషన్స్..

ప్రతిది పాజిటివ్ గా ఆలోచిస్తేనే విజయం సాధ్యం.. విశిష్ట అతిది ప్రముఖ సైకాలజిస్ట్  గుడిబోయిన పూర్ణచందర్

కుత్బుల్లాపూర్ ఫిబ్రవరి 14( లోకల్ గైడ్ ప్రతినిధి)

ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల మహబూబాబాద్ నందు స్పోర్ట్స్ అండ్ కల్చరల్  సెలబ్రేషన్స్ కళాశాల ప్రిన్సిపాల్ పొక్కుల  సదానందం అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది.
 ఈ సందర్భంగ ప్రిన్సిపల్ మాట్లాడుతూ కళాశాలలో 2025 26 సంవత్స సంవత్సరంలో దాదాపు 560 మంది విద్యార్థులతో విద్యా సంవత్సరం ఏ విధమైన ఒడిదుడుకులు లేకుండా అనేక వసతులు కల్పించి ప్రతిరోజు ఉదయం సాయంత్రం స్టడీ అవర్స్ నిర్వహిస్తూ ఆల్మానిక్ ఆధారంగా తరగతుల బోధన నిర్వహిస్తూ, అన్ని రకాల పరీక్షలలో విద్యార్థులు రాణించేలా సంసిద్ధం చేశామని, గత సంవత్సరంలో కళాశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి మార్కులు సాధించార ని ఈ సంవత్సరం కూడా అన్ని గ్రూపులలోని విద్యార్థులు ర్యాంకులను సాధిస్తారని  ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
ముఖ్య అతిథిగా విచ్చేసిన డి.ఐ ఈ.ఓ సిహెచ్ మదర్ గౌడ్ మాట్లాడుతూ మహబూబాద్ జిల్లాలోని ఒక గౌరవప్రదమైన విద్యార్థుల సంఖ్యతో అత్యుత్తమ ఫలితాలతో ముందున్న కళాశాల ఈ బాలికల కళాశాలని, దీనికోసం కఠోరంగా శ్రమిస్తున్న ప్రిన్సిపల్ బొగ్గుల సదానందాన్ని, అధ్యాపక బృందాన్ని అభినందించారు, వారు చేస్తున్న కృషికి మీరు మంచి రిజల్ట్ తీసుకొస్తేనే సార్ధకత ఉంటుందని ఉన్న సమయాన్ని వృధా చేయకుండా మంచిగా చదువుకొని పరీక్షల్లో ఇబ్బందులు పడకుండా విజయం సాధించాలని ఆశీస్సులు అందజేశారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన *ప్రముఖ సైకాలజిస్ట్  గుడిబోయిన పూర్ణచందర్* మాట్లాడుతూ విద్యార్థులు మానసికంగా దృఢంగా ఉన్నప్పుడే ఏ లక్ష్యాన్నైనా సులభంగా సాధిస్తారని ,అందులో ఆడవాళ్లు మానసికంగా చాలా స్ట్రాంగ్ అని, ఎటువంటి పరిస్థితుల్లోనైనా ధైర్యంగా ఎదుర్కొని ముందుకు వెళ్తారని, వెళ్లాలని సూచిస్తూ ప్రతి విద్యార్థి  తనను తానే ప్రేమించుకుంటూనే ,  తల్లిదండ్రులను మాత్రమే ప్రేమించాలని , సంబంధం లేని వ్యక్తులు  ప్రేమ చూపినట్లు మాత్రమే నటిస్తారని , అది నిజమైన ప్రేమ కాదని, ప్రేమల వల్ల జీవితాన్ని ఆగం చేసుకోవద్దని సూచించారు. విద్యార్థులందరూ పాజిటివ్గా ఆలోచించాలని, మన ఆలోచనలన్నీ పాజిటివ్గా మొలచుకొని జీవితంలో రాణించాలని, ప్రపంచంలో విజేతలుగా నిలిచిన వారందరూ హఠోరశ్రమ ద్వారా మాత్రమే విజేతలుగా నిలిచారని ,వారిని ఆదర్శంగా తీసుకొని ,అనవసర విషయాల జోలికి పోకుండా స్వీయ క్రమశిక్షణను పాటించి తల్లిదండ్రుల కలలను సహకారం చేయాలని తెలిపారు. ఇక్కడ  ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కూడా గతంలో అనేక ఇబ్బందులకు ఎదురోడ్డు, పోరాడి,  గౌరవమైన స్థాయిలో ఇక్కడ మీ ముందు ఉన్నారని, ఒక విజయం వెనుక ఎన్నో పరాజయాల అనుభవాలు ఉన్నాయని, మీరు  ఆ విధంగా శ్రమిస్తే భవిష్యత్తులో  ఉన్నత స్థితిలో ఉండవచ్చని అన్నారు, ఇంటర్మీ డియట్ స్థాయిలో సరైన మానసిక మరి పక్వత లేక విద్యార్థిని లు ప్రేమ అనే మాయలో చిక్కుకొని జీవితంలో ఘర్షణ వాతావరణం కొని తెచ్చుకుంటారని అలా కాకుండా స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పరచుకొని మంచి అవగాహనతో కష్టపడి విజయం సాధించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు కుమార్, గణేష్, సాదికలి ,చొప్పరి శ్రీనివాస్, రియాజ్ రవి కిరణ్, కిరణ్ కుమార్,  స్వాతి, భార్గవి, సరిత ,కిరణ్ కుమార్, సురేందర్, నవీన్, స్వరూప సృజన , పూర్ణిమ, శ్రవణ్ కుమార్, భాగ్యలక్ష్మి, లక్ష్మి, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు..

Tags:

About The Author

Latest News