కారేపల్లి మండలం మాదారం గ్రామ సెంటర్ లో 

చిన్నారి అనుమానాస్పద మృతిపై  గ్రామస్తుల నిరసన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్

కారేపల్లి మండలం మాదారం గ్రామ సెంటర్ లో 

IMG-20260226-WA0247ఖమ్మం జిల్లా, కారేపల్లి : లోకల్ గైడ్, ఫిబ్రవరి 26 :  నాగర్‌కర్నూల్ జిల్లా, కొమ్మరి జాతరలో రెండేళ్ల చిన్నారి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటనపై మాదారం గ్రామ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారి మృతికి కారణమైన దోషులను వెంటనే అరెస్ట్ చేయాలని మరియు బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం సాయంత్రం మాదారం సెంటర్‌లో భారీ కొవ్వొత్తుల నిరసన ప్రదర్శన నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మాదారం గ్రామానికి చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు తరలివచ్చి తమ సంఘీభావాన్ని ప్రకటించారు. అభం శుభం తెలియని చిన్నారి ప్రాణాలు కోల్పోవడం సభ్య సమాజానికే సిగ్గుచేటని, బాధిత కుటుంబానికి అండగా నిలవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఈ సందర్భంగా నాయకులు మరియు గ్రామ పెద్దలు పేర్కొన్నారు.
 చిన్నారి మృతికి కారణమైన వారిని వెంటనే గుర్తించి, కఠినంగా శిక్షించాలి బాధితుల ఫిర్యాదును నిర్లక్ష్యం చేసిన పోలీసులపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలి చిన్నారి కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే ఆర్థిక సహాయం అందించి, న్యాయం జరిగే వరకు రక్షణ కల్పించాలి.మాదారం గ్రామానికి చెందిన అన్ని సామాజిక వర్గాల ప్రజలు మరియు సామాజిక స్పృహ కలిగిన వ్యక్తులు పాల్గొని ఈ శాంతియుత నిరసనను జయప్రదం చేశారు. న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని వారు ఈ సందర్భంగా హెచ్చరించారు.

Tags:

About The Author

Latest News