పఠాన్ చేరు, (లోకల్ గైడ్ ప్రతినిధి కృష్ణ):
అమీన్పూర్ డివిజన్ పరిధిలోని చక్రపురి కాలనీ సుబ్బారెడ్డి లేఅవుట్‌లో ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న మంచినీటి సమస్యకు పరిష్కారంగా కొత్త పైప్ లైన్ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. గురువారం ఉదయం ఈ పనులను మున్సిపల్ మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగా రెడ్డి ప్రారంభించారు. ఈ పైప్ లైన్ నిర్మాణం పఠాన్ చేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మార్గదర్శకత్వం, సహకారంతో చేపట్టడం సంతోషం. కాలనీలో తాగునీటి సరఫరా లోపాల వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ పనులను చేపట్టినట్లు నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా తుమ్మల పాండురంగా రెడ్డి మాట్లాడుతూ..ప్రజల అవసరాలను గుర్తించి దశలవారీగా అభివృద్ధి పనులు కొనసాగిస్తున్నామని చెప్పారు. మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం అందించడమే లక్ష్యమని పేర్కొన్నారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సహకారంతో అమీన్పూర్ డివిజన్‌లో మరిన్ని మౌలిక వసతుల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. శ్రీనివాసులు ఈ అభివృద్ధి కార్యక్రమాలపై హర్షం వ్యక్తం చేస్తూ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కల్పన ఉపేందర్ రెడ్డి, కొల్లూరు చంద్రకళ గోపాల్, మాజీ కో-ఆప్షన్ సభ్యులు తల్లారి రాములు, కాలనీ వాసులు, తదితరులు పాల్గొన్నారు.