సాగు భూములన్నిటికి రైతు భరోసా ఇవ్వాలి _సామాజిక కార్యకర్త నర్సింహ

తెలంగాణ ప్రభుత్వం ఖరీఫ్,రబీ సీజన్ అనకుండా సకాలంలో రైతు లకు పెట్టు బడి సాయం రైతు భరోసా

సాగు భూములన్నిటికి రైతు భరోసా ఇవ్వాలి _సామాజిక కార్యకర్త నర్సింహ

నారాయణపేట ఫిబ్రవరి 14:

సాగు భూములన్నింటికి ప్రభుత్వం రైతు భరోసా డబ్బులు ఇవ్వాలని సామా జిక కార్యకర్త నర్సింహ డిమాండ్ చేశారు.తెలంగాణ ప్రభుత్వం ఖరీఫ్,రబీ సీజన్ అనకుండా సకాలంలో రైతు లకు పెట్టు బడి సాయం రైతు భరోసా డబ్బులు వారి బ్యాంక్ ఖాతాలలో జమ చేయాలని సామాజిక కార్యకర్త హెచ్.నర్సింహా,కూలీలు రోష న్ బీ,చిన్న కిష్టమ్మ,శశికళ, ఎల్లమ్మ,నిర్మల తదితరులు కోరారు.ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం ఎకరాలు 15 వేలు ఇవ్వాలి కానీ 12 వేలు మాత్రమే ఇస్తున్నారాని అన్నారు..అప్పుడు అలా మోసం చేసి 3వేలు తక్కుచేస్తే ఇప్పుడు కొత్తగా యాసంగిలో పంటలు వేసిన వారికి శాటి లైట్ ఆధారంగా మాత్రంగానే రైతు భరోసా ఇస్తాం అనడం రైతులకు తీరని అన్యాయం చేయడమేనని అన్నారు. పంటలు సాగు చేసే భూము లన్నిటికి రైతు భరోసా ఇవ్వా లని డిమాండ్ చేశారు. ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యిందనీ  వెంటనే రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేసి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఫోటో రైట్ అప్:5.సాగు చేసిన భూమి
________________________

Tags:

About The Author

Latest News