వరి పంటలో పసుపు కాండం తొలిచే పురుగు నివారణ శిక్షణ...
రైతులకు రావెప్ విద్యార్థులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
By Ram Reddy
On
బెల్లంపల్లి (లోకల్ గైడ్)
ఎర్మల్ రాజేశ్వర్,గజ్జెల క్రిష్ణ హరి,ఘనశ్యామ్ బఘర్,హన్స్ రాజ్,ఖాత జయంత్ లు నిర్వహించారు.ఈ కార్యక్రమం బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం పర్యవేక్షణలో జరిగింది.వరి మొలకల ఆకుల కొనలను నాటే ముందు కత్తిరించడం వల్ల పసుపు కాండం తొలిచే పురుగు( మోగి పురుగు)గుడ్లు,పురుగులు పొలంలోకి ప్రవేశించకుండా అడ్డుకోవచ్చని విద్యార్థులు రైతులకు వివరించారు.ఈ విధానం వల్ల రసాయన పురుగుమందుల వినియోగం తగ్గి,ఖర్చులు తగ్గడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదపడుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతులు శిక్షణ ఎంతో ఉపయోగకరంగా ఉందని,భవిష్యత్తులో ఈ పద్ధతిని తప్పకుండా అమలు చేస్తామని తెలిపారు.ఇలాంటి అవగాహన కార్యక్రమాలు మరిన్ని గ్రామాల్లో నిర్వహించాలని వారు కోరారు.
Tags:
About The Author
Related Posts
Latest News
03 Feb 2026 13:42:52
మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ అభ్యర్థుల బీఫాంలో ప్రకటించడానికి జిల్లా డిసిసి అధ్యక్షులు రఘునాథరెడ్డి క్యాంపు కార్యాలయం చేరుకున్నారు.గత...
